Harish Rao : రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టారు : మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ గాలి ఎక్కడ వీస్తుందని.. అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.

Harish Rao : రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టారు : మంత్రి హరీష్ రావు

Minister Harish Rao (4)

Updated On : October 21, 2023 / 7:05 PM IST

Harish Rao Serious Comments : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేయమంటే పారి పోయారని ఎద్దేవా చేశారు. ‘బీజేపీ పై పోరాడడమే నా డిఎన్ ఏ’ అని రాహుల్ గాంధీ అంటున్నారని తెలిపారు. రేవంత్ డీఎన్ఏ ఏదో తెలుసు కోవాలన్నారు. రాహుల్, రేవంత్ డీఎన్ఏ కలవడం లేదన్నారు.

ఆ నాడు ఓటుకు నోటు… నేడు నోటు కు సీటు అని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఓటుకు నోటు దొంగ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గాలి ఎక్కడ వీస్తుందని.. అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ మళ్ళీ గెలవాలని అభివృద్ధిలో ఆగ కూడదన్నారు. కేసీఆర్ కు పని తనమే కానీ పగ తనం లేదన్నారు. పగ ఉంటే రేవంత్ ఎప్పుడో జైల్లో ఉండేవాడన్నారు.

Pawan Kalyan : కులమతాల గురించి మాట్లాడేటప్పుడు రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి.. పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్ధేశం

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బడా లీడర్లు ఏమి చేశారని నిలదీశారు. మెడికల్ కాలేజ్ లేదు, బత్తాయి మార్కెట్, నిమ్మకాయల మార్కెట్ తేవడం చేత కాలేద్నారు. కర్ణాటక నుంచి అక్రమ డబ్బులు తెచ్చి ఇక్కడ ఆగం చేసే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ను మూడో సారి గెలిపించుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని తెలిపారు. తమ సీఎం కేసీఆర్ అని తాము చెబుతాం..కాంగ్రెస్ లో సీఎం ఎవరు అని ప్రశ్నించారు. పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఏమైనా చేస్తారని తెలిపారు. సౌత్ లో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని పేర్కొన్నారు.