CM KCR: ‘ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించండి’

ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వారి గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు..

CM KCR: ‘ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించండి’

Kcr Kishan

Updated On : February 21, 2022 / 3:45 PM IST

CM KCR: ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వారి గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(EWS)10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మూడేళ్ల నుంచి ఆర్థిక వెనుకబాటు గురైన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయట్లేదని వాపోయారు.

తెలంగాణలో ఆర్ధికంగా వెనుకబడిన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణతో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగడం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 158 కేంద్ర విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అదనంగా 2.15 లక్షల సీట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.4315.15 కోట్లను కేటాయించినట్లుగా వెల్లడించారు.

Read Also: మోదీ పాలనపై చర్చించేందుకు సిద్ధం..కేసీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి