Ponguleti Srinivas Reddy : ధరణిని ప్రక్షాళన చేస్తాం- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ధరణి అప్లికేషన్లను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి.

Ponguleti Srinivas Reddy : ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తయారు చేశామని, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. ప్రభుత్వ స్థలాల వివరాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇబ్బందులకు గురి చేసిందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ధరణి అప్లికేషన్లను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి.
‘పబ్లిక్ కు సామాన్యులకు ఉపయోగపడే అనేక అంశాలను ఇన్ కార్పొరేట్ చేసి కొత్త ఆర్వోఆర్ చట్టం 2024 తయారు చేయడం జరిగింది. ఈ చట్టాన్ని రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతాం. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలను ప్రక్షాళన చేస్తాం. ధరణిలో గతంలో 33 మాడూల్స్ ఉండేవి. వీటితో సామాన్య ప్రజలకు మాడ్యూల్ ఉద్దేశం ఏంటో తెలియక ఏ కాంపోనెంట్ తో అప్లయ్ చేయాలో తెలియక ఇబ్బంది పడేవారు.
కొంతమంది ఒక మాడ్యూల్ కు బదులుగా ఇంకో మాడ్యూల్ అప్లయ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆనాడు అధికారులు వెంటనే రిజెక్ట్ చేసేవారు కాదు. ఒక 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో చూసి మీ అప్లికేషన్ 28వ మాడ్యూల్ లో ఉంది. 33వ మాడ్యూల్ లో ఉంటేనే మేము చూస్తామని ఏడాది తర్వాత రిజక్ట్ చేసేవారు” అని మంత్రి పొంగులేటి తెలిపారు.
Also Read : తెలంగాణ తల్లి రూపంపై అనవసర రాద్ధాంతం వద్దు- శిల్పి రమణారెడ్డి