MLA Guvvala Balaraju Warning : ఎంపీ రాములుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వార్నింగ్

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ లో వర్గపోరు నెలకొంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య వర్గపోరు సాగుతోంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.

MLA Guvvala Balaraju Warning : ఎంపీ రాములుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వార్నింగ్

guvvala (2)

Updated On : March 6, 2023 / 9:07 AM IST

MLA Guvvala Balaraju Warning : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ లో వర్గపోరు నెలకొంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య వర్గపోరు సాగుతోంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఫ్లెక్సీ విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ‘స్థానిక ఎమ్మెల్యే ఉండగా మీ ఫొటోలతో ఫ్లెక్సీలు ఎలా వేసుకుంటారు’ అని ఎంపీ రాములును ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిలదీశారు. వచ్చే ఎన్నిక్లలో తమకే టికెట్ అంటూ తండ్రి, కొడుకుల ప్రచారంపై గువ్వల బాలరాజు మండిపడ్డారు. పార్టీ ఏది చెబితే దానికే కట్టుబడి ఉంటానని ఎంపీ రాములు చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల ఆడియో కాల్ వైరల్ గా మారింది.

Telangana: ఇషాసింగ్‌, మొగిలయ్యకు ఇళ్ల స్థలాల పత్రాలు అందజేత.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై గువ్వల అసహనం

గత కొంతకాలంగా ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఆ వర్గపోరు ఇప్పుడు స్థాయికి చేరుకుంది. మహాశివరాత్ర సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో ఎంపీ రాములు, జెడ్పీటీసీగా ఉన్న ఆయన తనయుడు భరత్ ఫోటోలు ఉన్నాయి. వీరిద్దరి ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని ఎంపీ రాములను స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. ఫ్లెక్సీలను ఎందుకు తొలగించాలని ఎంపీ రాములు ప్రశ్నించారు. దీంతో వీరిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది.

ఎంపీ రాములు, ఆయన తనయుడు భరత్ నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకోవడాన్ని గువ్వల బాలరాజు తప్పు పట్టారు. ఇది తప్పుడు ప్రచారమని, అదే విధంగా ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పినప్పటికీ ఎంపీ రాములు ధీటుగా సమాధానం ఇచ్చారు. ‘మీ బెదిరింపులకు భయపడేది లేదు… కచ్చితంగా ఫ్లెక్సీలు ఉంటాయి’ అని స్పష్టం చేశారు. నియోజవర్గంలో తామూ పార్టీలోనే ఉన్నామని, ఎంపీగా తనకు తిరిగే అవకాశముంటుందని ఎంపీ రాములు చెప్పారు.

బండి సంజయ్ పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు : ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

గతంలో చిన్న చిన్న వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ ఎవరి పని వారు చేసుకోవాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గ పరిధిలో మాత్రం ఎమ్మెల్యేకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. అదే విధంగా స్థానిక ఎంపీ రాములు నియోజకర్గంలో పర్యటిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఫ్లెక్సీల వివాదం తలెత్తకుండా చూసుకోవాలని అధిష్టానం ఇద్దరికీ సూచించింది.

ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇద్దరికీ కొన్ని చోట్ల ప్రోట్ కాల్ సమస్య తలెత్తింది. ఇప్పుడు శివరాత్రి సందర్భంగా వెలిసిన ఫ్లెక్సీల్లో ఇద్దరు ఫోటోలు వైరల్ కావడం, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనూ ఫోటోలు వేయవద్దని, ఫ్లోక్సీలు కట్టవద్దని గువ్వల బాలరాజు చెప్పవడంతోనే ఈ వివాదం మరింద ఉధృతంగా మారిందని తెలుస్తోంది.