MLA Rajasingh : బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పినా పట్టించుకోరా? జైశ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తేనే కేసు బుక్ చేస్తారా?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు. నన్ను చంపేస్తాం అని బెదిరిస్తు ఫోన్స్ వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీజీపీ కేసు నమోదు చేయటంలేదని వాపోయారు.

MLA Rajasingh : బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పినా పట్టించుకోరా? జైశ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తేనే కేసు బుక్ చేస్తారా?

MLA Rajasingh's letter wrote to DGP

MLA Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు. నన్ను చంపేస్తాం అని బెదిరిస్తు ఫోన్స్ వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీజీపీ కేసు నమోదు చేయటంలేదని వాపోయారు. 8 నంబర్లతో ఫోన్లు వస్తున్నాయని..పాకిస్థాన్ నుంచి ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నారని డీజీపీకి లేఖ రాశారు రాజాసింగ్. ఈ సందర్భంగా రాజాసింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పాకిస్థాన్ నుంచి ఫోన్లు వస్తున్నాయని డీజీపికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా  పట్టించుకోవటంలేదని.. కేసు నమోదు చేయటంలేదని ఆరోపించారు. జై శ్రీరామ్ వాయిస్ రేజ్ చేస్తే మాత్రం వెంటనే కేసు బుక్ చేస్తారు అంటూ విమర్శించారు. నాకు ప్రాణహాని ఉందని కాబట్టి తనకు గన్ కు లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరానని కానీ ఎటువంటి స్పందనా రాలేదని రాజాసింగ్ వాపోయారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే ఐన నాకు పాకిస్తాన్ నుండి బెదిరింపు కాల్స్ వస్తే కేసు పెట్టడం లేదని..కానీ హిందువుల తరుపున జై శ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తే మాత్రం వెంటనే కేసు బుక్ చేస్తున్నారని అన్నారు. గన్ లైసెన్స్ అడుగుతుంటే ప్రభుత్వం స్పందించకుండా..నాపై ఉన్న కేసులు కారణంగా గన్ లైసెన్స్ తిరస్కరిస్తున్నారని తెలిపారు.కేసులు ఉన్నప్పటకీ‌.. గన్ లైసెన్స్ పొందిన వాళ్ళు ఉన్నారుని ఈ సందర్భంగా రాజాసింగ్ గుర్తు చేశారు.నా ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ గన్ లైసెన్స్ ఇవ్వకపోవడం దారుణమన్నారు.

కాగా..వివాదాస్పదా వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే రాజాసింగ్ జైలుకు వెళ్లి వచ్చాక కాస్త కామ్ గానే ఉంటున్నారు. రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టి పోలీసులు అరెస్ట్ చేయటం..చర్లపల్లి జైల్లో వుండటం ఆ తరువాత పిడి యాక్ట్ ను ఎత్తివేసిన హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన రాజాసింగ్ అప్పటినుంచి కాస్త కామ్ గానే ఉంటున్నారు. ఈక్రమంలో తనకు ప్రాణహాని ఉందని..తనకు గన్ లైసెన్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అటు పోలీసుల నుంచి గానీ ఇటు ప్రభుత్వం నుంచిగానీ ఎటువంటి స్పందనా రావటంలేదని..పోలీసులు కేసు కూడా బుక్ చేయటంలేదంటూ వాపోయారు. అయినా తనదైన శైలిలో రాజాసింగ్ జైశ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తేనే కేసు బుక్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..రాజాసింగ్ జైలుకెళ్లిన తరువాత బీజేపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అప్పటినుంచి రాజాసింగ్ ను బీజేపీ పెద్దగా పట్టించుకోవటంలేదనే వార్తలు వస్తున్నాయి. కానీ తాను హిందూ ధర్మం కోసం పోరాడుతునే ఉంటానని రాజాసింగ్ స్పష్టంచేశారు.