V Hanumantha Rao: మోదీ పాలన నియంతను తలపిస్తోంది.. మీడియాపై దాడులు సరికాదు: వీహెచ్

మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది.

V Hanumantha Rao: మోదీ పాలన నియంతను తలపిస్తోంది.. మీడియాపై దాడులు సరికాదు: వీహెచ్

Updated On : February 15, 2023 / 7:53 PM IST

V Hanumantha Rao: ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శలు గుప్పించారు. మోదీ పాలన నియంతను తలపిస్తోందని విమర్శించారు. ఖమ్మం నుంచి బుధవారం హైదరాబాద్ వెళ్తున్న వీహెచ్, అక్కడి డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Chetan Sharma: కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విబేధాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెల్లడించిన చేతన్ శర్మ

ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. ‘‘మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది. ఐటీ దాడులతో మీడియాపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. బీబీసీపై దాడులను అన్ని మీడియా సంస్థలు వ్యతిరేకించాలి. ప్రతిపక్షాలను అవినీతి పేరుతో విచారణ సంస్థలతో ఇబ్బంది పెడుతున్న బీజేపీ.. స్వపక్షంలోని వాళ్లు అవినీతి చేస్తే మాత్రం ఎలాంటి విచారణ జరపట్లేదు.

ఎన్నికల వేళ ఎంపీ కోమటిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు సరికాదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కిందిస్థాయి కార్యకర్తలు డీమోరలైజ్ అవుతున్నారు. ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా ఉండి పని చేయాలి’’ అని వీహెచ్ వ్యాఖ్యానించారు.