భారత షేర్ మార్కెట్‌ను బద్నాం చేద్దామనుకుంటున్నారా? సీఎం రేవంత్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్

విదేశీ పత్రికలను మాత్రమే నమ్ముతారు రాహుల్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే హిండెన్ బర్గ్ పత్రికను నమ్ముతారు.

భారత షేర్ మార్కెట్‌ను బద్నాం చేద్దామనుకుంటున్నారా? సీఎం రేవంత్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్

Raghunandan Rao Madhavaneni : అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ పారిపోయారు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. గుడుంబా, సారాయి, గుట్కా వ్యాపారాన్ని దందా అంటారని.. ముఖ్యమంత్రి భాష అలా ఉంటుందని మండిపడ్డారు. సెబీ ఛైర్మన్ అదానీ సంస్థ షేర్లు కొంటే తప్పేముంది? అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి హిండెన్ బర్గ్ పత్రిక మీద నమ్మకం ఉంటే.. నాకు బ్లీడ్జ్ పత్రిక మీద నమ్మకం ఉందన్నారు ఎంపీ రఘునందన్. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

‘హిండెన్ బర్గ్ ఆర్టికల్ కు స్టాంటిటీ లేదని సుప్రీంకోర్టు చెప్పింది. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు, సెబీ మీద నమ్మకం లేదు. విదేశీ పత్రికలను మాత్రమే నమ్ముతారు రాహుల్ గాంధీ. ఎన్నికల్లో గెలుస్తా అనే నమ్మకంతో పోటీ చేసి మూడెంకల సంఖ్య దాట లేదు రాహుల్ గాంధీ. తమ్ముడు దందా చేస్తే తప్పు కానప్పుడు సెబీ ఛైర్మన్ షేర్లు కొంటే తప్పేంది? గుజరాత్ నుంచి ఢిల్లీ వచ్చి వ్యాపారం చేయమని రాజీవ్ గాంధీ పిలుపిచ్చారని అదానీ చెప్పారు. హిండెన్ బర్గ్ కు ఉన్న స్టాంటిటీ ఏంటి? దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే హిండెన్ బర్గ్ పత్రికను నమ్ముతారు. జార్జ్ సోర్స్ అనే ఒక బ్రోకర్ తన షేర్లను ఎక్కువ ధరకు అమ్ముకునే వ్యక్తి.

కాంగ్రెస్ నేతలు భారత షేర్ మార్కెట్ ను బద్నాం చేద్దామనుకుంటున్నారా? రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రమణ్య స్వామి కేసు వేశారు. భారత మీడియాపై రాహుల్ గాంధీకి నమ్మకం ఉందా? లేదా? బంగ్లాదేశ్ పత్రిక.. రాహుల్ గాంధీ స్విమ్ సూట్ లో ఉన్న ఫోటోలతో వార్త రాసింది.
రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని బ్లిడ్జ్ పత్రిక రాసింది. అనేక ఫోటోలు ప్రచురించింది. ఇవన్నీ అబద్ధాలని రాహుల్ గాంధీ చెప్పాలి.

బ్లిడ్జ్ పత్రికపై న్యాయ పోరాటం చేద్దామా? రేపు ఢిల్లీకి వెళ్తున్నా. రాహుల్ గాంధీకి బ్లిడ్జ్ పత్రిక ప్రతులను ఇస్తా. రేవంత్ రెడ్డి రాహూల్ గాంధీ అపాయింట్ మెట్ ఇప్పించాలి. గతంలో బండి సంజయ్ గుడికి వెళ్దామంటే.. ఎకసెక్కాలు ఆడిన హరీశ్ రావు.. నేడు అదే గుడికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లారు? గతంలో ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేశారని రేవంత్ రెడ్డి పై కేసు పెట్టిన కేటీఆర్ ఇప్పుడు ఎందుకు లొల్లి చేస్తున్నారు? అని నిలదీశారు ఎంపీ రఘునందన్ రావు.