తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీయనున్న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్
Narendra Modi: ఈ ట్రైన్‌లో 120 శాతం ఆక్యూపెన్సి రేషియో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.

Vande Bharat Express Train
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పరుగులు తీయనుంది. ఈ నెల 12న సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పకేటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు సికింద్రాబాద్-విశాఖ పట్నం మధ్య సేవలు అందించే వందే భారత్ ట్రైన్ తెలుగు రాష్ట్రాలకు నాలుగోది. విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్ – తిరుపతి, కాచిగూడ – యశ్వంత్ పూర్ మధ్య వందే భారత్ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి. ఈ ట్రైన్‌లో 120 శాతం ఆక్యూపెన్సి రేషియో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
దేశంలో మొత్తం 400 కొత్తతర వందే భారత్ రైళ్లను తీసుకురావాలని కేంద్ర సర్కారు భావిస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలావందే భారత్ రైళ్లను అభివృద్ధి చేస్తున్నారు.
కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ.. ఒంటరిగా 42 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన