National Herald Case : కాంగ్రెస్ నిరసనలు..ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ వరుసగా మూడో రోజు విచారణ చేస్తోంది. దీంతో మూడవరోజు కూడా కాంగ్రెస్ నిరసనలు చేస్తున్నారు. ఈక్రమంలో నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు.

National Herald Case..sonia And Rahul Gandhi
National herald case: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా మూడో రోజు బుధవారం (16,2022)కూడా విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గాంధీ కుటుంబం గౌరవాన్ని కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని గాంధీ కుటుంబాన్ని గౌరవాన్ని దిగజార్చే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా మూడవరోజు కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి యూత్ కాంగ్రెస్ వరకు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలకు ఎక్కడిక్కడ అడ్డుకుంటు అరెస్ట్ లు చేస్తున్నారు.
ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత..ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేణుకా చౌదరి పోలీసు ఎస్సై కాలర్ పట్టుకున్నారు. నన్ను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసుల్ని హెచ్చరించారు ఆమె. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న వేళ వరుసగా మూడవరోజు నిరసనలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు రేపు కూడా అంటే నాలుగవ రోజు కూడా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తొలి రెండు రోజులూ రాహుల్ గాంధీ సుదీర్ఘంగానే విచారించిన ఈడీ అధికారులు బుధవారం కాస్తంత తక్కువగా 9 గంటల పాటు ఆయనను విచారించారు. తొలి రెండు రోజుల మాదిరే బుధవారం కూడా రాహుల్‌ను మధ్యాహ్న భోజనం కోసం ఇంటికెళ్లేందుకు అనుమతించారు. రాహుల్ గాంధీని విచారణను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ నేతలు నిరసనలను తీవ్రతరం చేశారు. బైకుల్ని దగ్థం చేశారు.బస్సులను ధ్వంసం చేస్తున్న ఘటనలో కాంగ్రెస్ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు.