New Prty in Telangana : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ..?!

తెలంగాణలో ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. తాజాగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? త్వరలోనే కొత్తపార్టీ ఆవిర్భావం కాబోతోందా? అంటే నిజమనే సంకేతాలు వస్తున్నాయి.

New Prty in Telangana : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ..?!

New Political Party In Telangana

Updated On : October 27, 2021 / 5:37 PM IST

New Political Prty in Telangana: తెలంగాణలో ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. తాజాగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? త్వరలోనే కొత్తపార్టీ ఆవిర్భావం కాబోతోందా? అంటే నిజమనే సంకేతాలు వస్తున్నాయి.  కొత్తగా పార్టీ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ తో ఆవిర్భవించింది టీఆర్ఎస్.TRS అధినేత కేసీఆర్ దీక్షతో రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చారు. సీఎంగా కొనసాగుతున్నారు. అప్పటి వరకు తెలంగాణాను ఏలిన కాంగ్రెస్, టీడీపీలు ఉండనే ఉన్నాయి.

ఆనాటి కాంగ్రెస్ నుంచి తాజాగా పుట్టిన దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన వైస్ఆర్ తెలంగాణ పార్టీ వరకు తెలంగాణాలు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈక్రమంలో తెలంగాణాలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనున్నట్లుగా పక్కా సమాచారం. అలనాటి కాంగ్రెస్,టీఆర్ఎస్, టీడీపా, బీజేపీ,ఎంఐఎంలతో పాటు తాజాగా వైస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టగా.. తెగపైకి మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని సమాచారం..

Read more : షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల _ Anchor Shyamala Participating in YS Sharmila Padayatra

కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న డాక్టర్ వినయ్ కుమార్ అధ్యక్షతన కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. దీంట్లో భాగంగానే బంజారా హిల్స్ లో ఉన్న బంజారా ఫంక్షన్ లో తనకు మద్దతు తెలిపే వారితో డాక్టర్ వినయ్ కుమార్ సమావేశం అయినట్లుగా తెలుస్తోంది.కాగా..డాక్టర్ వినయ్ కుమార్ మాజీ కేంద్రమంత్రి శివశంకర్ కుమారుడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వినయ్ కుమార్ ఈ రోజు సాయంత్రం తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోటున్నట్లు తెలుస్తోంది. ఇదంతా కొత్తపార్టీ ఏర్పాటుకేనని తెలుస్తోంది.

Read more : వరి కావాలో.._ ఉరి కావాలో.._ ప్రజలే తేల్చుకోండి _ Bandi Sanjay Comments _ Huzurabad

కలిసి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందరికి సమానంగా న్యాయం జరగాలని ఎజెండాతో డాక్టర్ వినయ్ కుమార్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. రాజీనామా అనంతరం కొత్త పార్టీ సంబంధించిన విశేషాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.