దిశ కేసులో సంచలన కోణం : చెన్నకేశవులు భార్యకి 13 ఏళ్లే

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో సంచలన కోణం వెలుగులోకి వచ్చింది. దిశ అత్యాచార నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య మైనర్‌ అని తేలింది.

  • Published By: veegamteam ,Published On : December 21, 2019 / 10:07 AM IST
దిశ కేసులో సంచలన కోణం : చెన్నకేశవులు భార్యకి 13 ఏళ్లే

Updated On : December 21, 2019 / 10:07 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో సంచలన కోణం వెలుగులోకి వచ్చింది. దిశ అత్యాచార నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య మైనర్‌ అని తేలింది.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో సంచలన కోణం వెలుగులోకి వచ్చింది. దిశ అత్యాచార నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య మైనర్‌ అని తేలింది. చెన్నకేశవులు భార్య వయసు 13ఏళ్లని అధికారులు జరిపిన విచారణలో వెలుగుచూసింది. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం శుక్రవారం(డిసెంబర్ 20,2019) గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపింది. చెన్నకేశవులు భార్యకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. 

ఆమె పుట్టింది 15-06-2006గా ఉంది. దీంతో మైనర్ అని బయటపడింది. కాగా, ఆమె ప్రస్తుతం 6నెలల గర్భిని. దీంతో చెన్నకేశవులు తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు ఆమె మైనర్‌ కావడంతో బాలల సదనంలో ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. అయితే ఆమె గర్భిణి అని, సదనానికి పంపబోమని చెన్నకేశవులు తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. చిన్నప్పుడే చెన్నకేశవులు భార్య తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి ఆమె బాబాయి, నాయనమ్మ ఇంట్లో ఉంటోంది. చెన్నకేశవులును ప్రేమించి పెళ్లాడిన తర్వాత అత్త ఇంటికి వచ్చింది.

దిశ హత్యాచారం కేసులో ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిశపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నలుగురు నిందితుల్లో జొల్లు శివ, జొల్లు నవీన్ మైనర్లు అని వార్తలొచ్చాయి. తాజాగా ఏ4 నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు భార్య మైనర్ అన్న విషయం వెలుగులోకి రావడం చర్చకు దారితీసింది.

కాగా, దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేయాలని చెప్పింది. డిసెంబర్ 23 సాయంత్రం 5గంటల లోపు రీపోస్టుమార్టం పూర్తి చేయాలంది. కాగా, రీ పోస్టుమార్టంకు సంబంధించి హైకోర్టు ఓ మార్పు చేసింది. రీ పోస్టు‌మార్టంను తెలంగాణ రాష్ట్రేతరులతోనే నిర్వహించాలంది. ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులతో రీ-పోస్టుమార్టం చేయించాలని చెప్పింది. పోస్టుమార్టం ప్ర్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.

Read More : దిశ కేసు : మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశం