తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది అప్పుడేనా? ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్‌తో..

కిషన్‌రెడ్డి మళ్లీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఇష్టపడట్లేదంటున్నారు. కాళేశ్వరం ఇష్యూతో ఈటలకు స్టేట్‌ చీఫ్ పోస్ట్‌ దక్కుతుందా లేదా అన్న డైలమా కొనసాగుతోంది.

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది అప్పుడేనా? ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్‌తో..

Updated On : June 26, 2025 / 8:35 PM IST

తెలంగాణ పాలిటిక్స్‌లో ఆరు నెలలుగా ఒకటే చర్చ. అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక. ఎందరో ఆశావహులు. ఎన్నో ఈక్వేషన్స్..మరెన్నో క్యాలిక్యులేషన్స్ మధ్య పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత నుంచి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక..డైలీ ఎపిసోడ్‌గా కంటిన్యూ అవుతోంది. అయితే ఆ మధ్య అధ్యక్షుడి ఎంపిక ఆల్మోస్ట్ పూర్తి అయిందని..ఏ క్షణంలోనైనా జాతీయ నాయకత్వం ప్రకటన చేయొచ్చన్న ప్రచారం జరిగింది.

కానీ ఇప్పటివరకు హు ఈజ్‌ బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ అనేదానిపై క్లారిటీ రాలేదు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కామెంట్స్‌తో ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారనేది మరోసారి ఇంట్రెస్టింగ్‌గా మారింది. జులై రెండోవారంలో స్టేట్‌ బీజేపీ చీఫ్ ఎవరనే దానిపై క్లారిటీ వస్తుందని..జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎలక్షన్‌ ఉంటుందని చెప్పుకొచ్చారు లక్ష్మణ్. దీంతో మరోసారి ఆశావహుల్లో గుబులు మొదలైంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందర్ రావు, డీకే అరుణతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, చింతల రాంచంద్రారెడ్డి, మురళీధర్‌రావు పేర్లు ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తున్నాయి. ఎమ్మెల్యేల నుంచి పాయల్ శంకర్ కూడా తాను రేసులో ఉన్నానని తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. బీసీ కోటాలో అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారన్న టాక్ ఉంది.

Also Read: సెబీ ఛైర్మన్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు 

ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సైలెంట్‌గా అధ్యక్ష పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారట. ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాకుండా పాతవారికే అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్‌తో రాంచందర్ రావు సీనియర్ల మద్దతు కూడగట్టినట్లు టాక్.

అయితే కాళేశ్వరం ఇష్యూ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్న ఈటల ప్లస్సులు, మైనస్‌లను మార్చేసిందన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం విచారణ సందర్భంగా చేసిన కామెంట్స్‌ ఆయనకు మైనస్‌గా మారాయన్న చర్చ ఉంది. కాళేశ్వరం అవినీతిమయమని బీజేపీ అంటుంటే.. కాళేశ్వరంతో నీళ్లు వచ్చాయని, క్యాబినెట్ అప్రూవల్‌తోనే కట్టామని ఈటల చెప్పడం హాట్ టాపిక్‌ అయింది. అధ్యక్ష రేసులో ఉన్న ఈటలకు కాళేశ్వరం కాంట్రవర్సీ తలనొప్పి తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు.

RSS బ్యాగ్రౌండ్‌ ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలంటూ..

పలువురు స్టేట్‌ లీడర్లు ఈటల కామెంట్స్‌ను బీజేపీ జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు. గతంలోనూ ఈటలది వామపక్ష భావజాలమని.. RSS బ్యాగ్రౌండ్‌ ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలని జాతీయ నేతలకు రాష్ట్ర నేతలు లేఖలు రాసినట్లు వార్తలు వచ్చాయి. దానికి తోడు కాళేశ్వరంపై ఈటల కామెంట్స్‌తో..అధ్యక్ష రేసులో ఆయన ముందు వరుసలోనే ఉన్నారా.? లేరా అన్న డైలమా కంటిన్యూ అవుతోంది.

ఇక బండిసంజయ్ కూడా స్టేట్‌ చీఫ్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఆపరేషన్‌ కగార్‌తో పాటు పలు అంశాల్లో ఆయన చేసిన కామెంట్స్ ఇష్యూ అయ్యాయి. సేమ్‌టైమ్‌ బండి సంజయ్‌కి అధ్యక్ష పదవి ఇస్తే ఆయనకు మూడు పదవులు అయిపోతాయనే చర్చ ఉంది. ఇప్పటికే ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండికి.. స్టేట్‌ బీజేపీ చీఫ్‌ పోస్ట్ మూడో పదవి కానుంది. దీంతో కౌన్‌బనేగా బీజేపీ చీఫ్‌ అనేది ఉత్కంఠ రేపుతోంది.

ఎనిమిది ఎంపీల్లోనే ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి మళ్లీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఇష్టపడట్లేదంటున్నారు. కాళేశ్వరం ఇష్యూతో ఈటలకు స్టేట్‌ చీఫ్ పోస్ట్‌ దక్కుతుందా లేదా అన్న డైలమా కొనసాగుతోంది. ఇక బండి సంజయ్‌ ఆల్రెడీ అధ్యక్షుడిగా పనిచేశారు. కొత్తవారికి అవకాశం ఇవ్వొచ్చన్న టాక్ ఉంది. అదే జరిగితే..ఎంపీలు రఘునందన్‌, అరవింద్ ధర్మపురి, డీకే అరుణలో ఎవరికో ఒకరికి రాష్ట్ర కాషాయ రథసారధి పగ్గాలు దక్కొచ్చంటున్నారు. తెలంగాణ కాషాయ రథసారిధిగా ఎవరికి అవకాశం దక్కబోతుందో చూడాలి మరి.