తెలంగాణలో అలాంటి పాటలు పాడొద్దు.. పంజాబ్ సింగర్‌కు నోటీసులు..
డ్రగ్స్, మద్యం, వయలెన్స్ ను ప్రేరేపించే విధంగా పాటలు పాడారని తెలంగాణ అధికారులకు ఛండీగడ్ కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు.

Singer Diljit Dosanjh (Photo Credit : Google)
Singer Diljit Dosanjh : ప్రముఖ పంజాబ్ పాప్ సింగర్ దిల్జిత్ సింగ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ శంషాబాద్ లోని నోవాటెల్ లో నిర్వహించే కన్సర్ట్ షో లో డ్రగ్స్, మద్యం, వయలన్స్ ప్రేరణ ఇచ్చే విధంగా పాటలు పాడొద్దని తెలిపారు. గత అక్టోబర్ లో ఢిల్లీలోని జేఎన్ యూలో నిర్వహించిన కాన్సర్ట్ షో లో దిల్జిత్ సింగ్.. డ్రగ్స్, మద్యం, వయలెన్స్ ను ప్రేరేపించే విధంగా పాటలు పాడారని తెలంగాణ అధికారులకు ఛండీగడ్ కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు దిల్జిత్ సింగ్ కు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్, మద్యం, వయలెన్స్ ను ప్రోత్సహించేలా షో నిర్వహించకూడదని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
సింగర్ దిల్జిత్ తో పాటు షో ఆర్గనైజర్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆల్కహాల్, డ్రగ్స్, హింసను ప్రేరేపించే విధంగా పాటలను పాడొద్దని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఛండీగఢ్ కు చెందిన పండిత్ రావ్.. దిల్జిత్ షో పై తెలంగాణ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో దిల్జిత్ చేసిన కన్సర్ట్ వీడియోలను ఆయన తెలంగాణ అధికారులకు పంపారు. ఆ కన్సర్ట్ షోలలో దిల్జిత్.. ఆల్కహాల్, డ్రగ్స్, హింసను ప్రేరేపించేలా పాటలు పాడాడని, అందుకు ఆధారంగా వీడియోలను సైతం పంపారాయన. గతంలో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, జైపూర్ లో దిల్జిత్ షోలు ఇచ్చాడు. అదే సమయంలో పలు అంతర్జాతీయ వేదికలపైనా దిల్జిత్ అలాంటి పాటలే పాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కాగా, హైదరాబాద్ లో దిల్జిత్ షో కు సంబంధించి టికెట్లు అన్నీ సేల్ అయిపోయాయి. ఢిల్లీలో అక్టోబర్ 26న కన్సర్ట్ షో ప్రారంభించాడు. ఆ తర్వాత దేశంలోని 11 ప్రముఖ సిటీలలో కన్సర్ట్ షోలు ఇస్తున్నాడు. అతడి టూర్ లో హైదరాబాద్ నగరం మూడవది. ఈ క్రమంలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, సీనియర్ సిటిజన్స్ రంగారెడ్డి జిల్లా కోర్టు.. నోటీసులు ఇచ్చాయి. దిల్జిత్ కానీ, నిర్వాహకులు కానీ.. లైవ్ షో లో వేదికపై పిల్లలను వాడుకోవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు.
షో లో భారీ శబ్దాలు ఉంటాయని, అవి పిల్లలకు ప్రమాదకరం అన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ నోటీసలు ఇచ్చారు. ”డబ్ల్యూహెచ్ వో ప్రకారం..13 ఏళ్లలోపు పిల్లలు 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వని స్థాయికి గురికాకూడదు. కాబట్టి, మీ లైవ్ షోలో పీక్ సౌండ్ ప్రెజర్ లెవెల్ 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉన్న చోట పిల్లలను స్టేజ్‌పై ఉపయోగించకూడదు” అని నోటీసులో పేర్కొన్నారు. కాన్సర్ట్ మార్గదర్శకాలు లౌడ్ మ్యూజిక్, ఫ్లాషింగ్ లైట్ల వినియోగాన్ని అంగీకరిస్తాయి. ఇది ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది, ముఖ్యంగా 13 ఏళ్లలోపు వారికి. కచేరీ నిర్వాహకులు, దిల్జిత్ దోసాంజ్.. సురక్షితమైన నియంత్రణ అనుకూల ఈవెంట్‌ను నిర్ధారించడానికి ఈ ఆదేశాలను పాటించాలని అధికారులు గుర్తు చేశారు.
Also Read : మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు : కేటీఆర్