Sirivennela: పోలీసోళ్ల కోసం పాట రాశారు – సజ్జనార్

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న సంబంధం గురించి చెప్తూ.. రెండేళ్ల తమ బాంధవ్యం గురించి చెప్పుకొచ్చారు.

Sirivennela: పోలీసోళ్ల కోసం పాట రాశారు – సజ్జనార్

Sirivennela

Updated On : December 1, 2021 / 9:29 AM IST

Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న సంబంధం గురించి చెప్తూ.. రెండేళ్ల తమ బాంధవ్యం గురించి చెప్పుకొచ్చారు. పోలీసులంటే సిరివెన్నెలకు ఉన్న ప్రత్యేకమైన అభిమానం గురించి వివరించారు.

సిరివెన్నెలతో నాకు చాలా పరిచయం ఉంది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. రెండేళ్ళ నుంచి ఆయనతో పరిచయం పెరిగింది. పోలీస్ అంటే సిరివెన్నెలకు ఎంతో ప్రేమ, అభిమానం. సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడు కరోనా సమయం అయినప్పటికీ పోలీస్ వ్యవస్థ మీద ఆఫీసుకు వచ్చి ఒక పాట కూడా రాశారు’

‘వారం రోజుల క్రితమే సిరివెన్నెలతో మాట్లాడాను. రాబోయే సినీ రైటర్స్ సిరివెన్నెలను ఆదర్శంగా తీసుకోవాలి. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని వెల్లడించారు.

………………………………………..: S. E. X అక్షరాలతో ఇష్యూ అయిన నంబర్ ప్లేట్