Kokapet Lands Rates : ఎకరం రూ.100 కోట్లు, కోకాపేట భూముల వేలంలో ఆల్‌టైమ్ రికార్డ్

నియోపోలిస్ భూములు హాట్ కేక్ గా మారాయి. ఏపీఆర్-రాజ్ పుష్ప రియాల్టీ కంపెనీల మధ్య బిడ్డింగ్ హోరాహోరీగా... Kokapet Lands Rates

Kokapet Lands Rates : ఎకరం రూ.100 కోట్లు, కోకాపేట భూముల వేలంలో ఆల్‌టైమ్ రికార్డ్

Kokapet Lands Rates

Kokapet Lands : ఎకరం భూమి ధర కోటి రూపాయలు. ఏంటి షాక్ అయ్యారా? కోటి రూపాయలా అని నివ్వెరపోతున్నారా? అవును నిజమే. ఎకరం భూమి రేటు అక్షరాల కోటి రూపాయలే. ఇదెక్కడో తెలుసా. హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న కోకాపేటలో. అక్కడ నియోపొలిస్ భూములకు భారీ డిమాండ్ వచ్చింది. వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. 45 ఎకరాలకు ప్రభుత్వం రూ.2వేల 500 కోట్లు ఆశిస్తోంది. దీంతో పాటు ఇతర పన్నులు, ఫీజుల రూపంలో మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

హెచ్ఎండీఏ ఈ-వేలం కొత్త రికార్డ్ సాధించింది. ఓఆర్ఆర్ దగ్గరలోని ప్లాట్ నెంబర్ 10లో ఎకరం భూమి ధర రూ.100 కోట్లు పలికింది. దీంతో నియోపోలిస్ భూములు హాట్ కేక్ గా మారాయి. ఏపీఆర్-రాజ్ పుష్ప రియాల్టీ కంపెనీల మధ్య బిడ్డింగ్ హోరాహోరీగా సాగుతోంది.

Also Read..Laptop Imports: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల దిగుమతిపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?

కోకాపేట భూముల ధరలు వేలంలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎకరం ధర వంద కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ప్లాట్ నెంబర్ 10 కోసం వంద కోట్ల బిడ్ వేసినట్లు సమాచారం. ఏపీఆర్-రాజ్ పుష్ప కంపెనీల మధ్య బిడ్డింగ్ పోటాపోటీగా సాగుతోంది. ఇంకా ఆన్ లైన్ వేలం కొనసాగుతోంది.

కోకాపేటలో నియోపోలిస్ ఫేజ్-2 భూములకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ఈ ఆక్షన్ లో భూముల ధర ఆల్ టైమ్ రికార్డ్ పలికింది. ఎకరం రేటు వంద కోట్లు దాటేసింది. ఇంకా వేలం కొనసాగుతోంది. 45.3 ఎకరాలకు సంబంధించిన వేలం పాట జరుగుతోంది. ఇందులో అత్యధికంగా ఎకరం ధర 100 కోట్లకు చేరుకుంది. రెండు రియాల్టీ సంస్థలు ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాల కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో ఎకరం ధర 100 కోట్లు క్రాస్ చేసింది. ఏపీఆర్, రాజపుష్ప రియాల్టీ సంస్థలు ప్లాట్ నెంబర్ 10 కోసం పోటీపడుతున్నాయి. కోకాపేట భూముల వేలంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్.

నియోపోలిస్ ప్లాట్లకు ఎందుకంత డిమాండ్..
కోకాపేట నియోపోలిస్ లో ప్లాట్లకు భారీగా డిమాండ్ ఉంది. 2021లోనూ వేలంలో ఇక్కడ ఎకరం ధర రూ.60కోట్లకు పైనే పలికింది. నియోపోలిస్ సెంటర్ పాయింట్ లో ఉంటుంది. బాగా ఎత్తులో ఉంటుంది. దాంతోపాటు నియోపోలిస్ ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉంటుంది. ఇక్కడ హెచ్ఎండీఏ ప్రణాళికబద్దంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. వెడల్పైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థ.. ఇలా అన్ని రకాల మౌలిక వసతులను ఇక్కడ హెచ్ఎండీఏ డెవలప్ చేసింది. దాంతో పాటు ఐటీ హబ్ కు పక్కనే నియోపోలిస్ ఉంటుంది. ఈ కారణాలతో నియోపోలిస్ లో ఉన్న ప్లాట్లకు భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఈరోజు వేసిన వేలంలో ప్లాట్ నెంబర్ 10 ప్రైమ్ లొకేషన్ లో ఉంది. నియోపోలిస్ కు దారితీసే రోడ్లు అన్నీ కూడా ఈ ప్లాట్ నెంబర్ 10 దగ్గరి నుంచే స్టార్ట్ అవుతాయి. ప్లాట్ నెంబర్ 10 పక్కన పెద్ద పెద్ద రియాల్టీ కంపెనీలు నిర్మాణాలు ప్రారంభించాయి. హైరైజ్ అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నాయి.