గులాబీ జెండాకు కేసీఆరే ఓనర్: ఎర్రబెల్లి

గులాబీ జెండాకు కేసీఆరే ఓనర్: ఎర్రబెల్లి

Updated On : August 31, 2019 / 8:42 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక కామెంట్లు చేశారు. మీడియా సమావేశంలో సరదాగా మాట్లాడిన ఎర్రబెల్లి.. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. 

మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. టీఆర్ఎస్ జెండాకి కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని అన్నారు. ఈటల రాజేందర్ అంశం ఇక సమసిపోయినట్లేనని.. పదవికి ఢోకా ఏం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమానికి తాను కూడా ఎంతో సపోర్ట్ చేశానన్నారు ఎర్రబెల్లి. టీడీపీలో ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా లేఖ ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి. గులాబీ జెండాకు తాము ఓనర్లమన్న ఈటల రాజేందర్.. మంత్రి పదవి బిక్ష కాదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఆ తరువాత తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కేసీఆరే తమ నాయకుడు అని స్పష్టం చేశారు. రెండ్రోజులుగా సంచలనం సృష్టిస్తోన్న రాజేందర్ వ్యాఖ్యలు ఎటువంటి ప్రభావం చూపలేదని వెల్లడించారు ఎర్రబెల్లి.