“పెద్దమ్మ తల్లీ క్షమించు.. నీ విగ్రహాలను ఎత్తుకెళ్తున్నాం..” చోరీ చేసేముందు దేవతను మొక్కిన దొంగలు
ఓ దొంగ ఆలయంలోకి ప్రవేశించి సంచితో బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

చోరీ చేసేముందు దేవత విగ్రహాలకు దండలు వేసి మొక్కారు దొంగలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో దొంగలు ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో వరుసగా ఆలయాల్లో చోరీలు జరిగాయి.
దండు మైలారంలో అయ్యప్ప గుడిలో, ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో పెద్దమ్మ, గంగాదేవి ఆలయాలతో పాటు రామాలయంలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. చోరీలు చేసే ముందు దేవుళ్ల విగ్రహాలకు దండలు వేసి మొక్కి, తాళాలను కట్టర్‌తో పగలగొట్టారు.
రెండు ఆలయాల నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన విగ్రహాలు, హుండీ డబ్బు ఎత్తుకెళ్లారు. ఆలయ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ మహేందర్ రెడ్డి ఆలయాలను పరిశీలించారు. ఓ దొంగ ఆలయంలోకి ప్రవేశించి సంచితో బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా దొంగను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.