జీహెచ్‌ఎంసీ ఎక్స్ అఫీషియో మెంబర్లపై హైకోర్టులో పిటిషన్‌

  • Published By: bheemraj ,Published On : December 2, 2020 / 07:30 AM IST
జీహెచ్‌ఎంసీ ఎక్స్ అఫీషియో మెంబర్లపై హైకోర్టులో పిటిషన్‌

Updated On : December 2, 2020 / 10:40 AM IST

GHMC ex-officio members : జీహెచ్‌‌‌‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌‌‌‌ ఎన్నికల్లో ఎక్స్‌‌‌‌ అఫీషియో ఓటర్లుగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ ఈ పిల్‌‌ను దాఖలు చేశారు.



జీహెచ్‌‌‌‌ఎంసీలో 150 వార్డు డివిజన్లు ఉంటే 55 మంది ఎక్స్‌‌‌‌ అఫీషియో మెంబర్స్‌‌‌‌ ఓటింగ్‌‌‌‌లో పాల్గొనేందుకు అనుమతి ఉందని.. ఇది మెజార్టీ సభ్యుల పాలన జరగాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చేలా ఉందంటూ పిటిషన్ వేశారు. జీహెచ్‌‌‌‌ఎంసీలో మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో చట్టసభ సభ్యులు ఓటు వేసే అవకాశం ఉందన్నారు.



https://10tv.in/state-election-commission-ban-exit-polls-on-ghmc-elections/
ఇందుకు అనుమతి ఇచ్చే జీహెచ్‌‌‌‌ఎంసీ యాక్ట్‌‌‌‌ 1955లోని సెక్షన్‌ 90(1) చట్ట వ్యతిరేకమని ప్రకటించి.. దానిని కొట్టేయాలని కోరారు. పిటిషన్‌లో చీఫ్‌‌‌‌ సెక్రటరీ, మున్సిపల్, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శులు, స్టేట్‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌ కమిషన్, జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.