Harish Rao: ముగిసిన హరీశ్ రావు విచారణ.. 7 గంటలు ప్రశ్నల వర్షం

ఉదయం 11 గంటల నుంచి హరీశ్ ను సిట్ అధికారులు విచారించారు. నిన్న రాత్రి నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరయ్యారు హరీశ్ రావు.

Harish Rao: ముగిసిన హరీశ్ రావు విచారణ.. 7 గంటలు ప్రశ్నల వర్షం

Harish Rao Representative Image (Image Credit To Original Source)

Updated On : January 20, 2026 / 7:21 PM IST

 

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా సిట్ అధికారులు హరీశ్ ను ప్రశ్నించారు. విచారణ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి హరీశ్ రావు వెళ్లిపోయారు. ఆయన నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లారు. కేటీఆర్, ఇతర ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.

ఉదయం 11 గంటల నుంచి హరీశ్ ను సిట్ అధికారులు విచారించారు. నిన్న రాత్రి నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరయ్యారు హరీశ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ పాత్రపై ఆరుగురు సభ్యుల బృందం విచారించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరగంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్లీ ఎంక్వైరీ కంటిన్యూ చేశారు.

Also Read: బైక్ కీస్ లాక్కోవద్దు, బలవంతం చేయొద్దు.. పెండింగ్ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు