Vikarabad Girl Murder : వికారాబాద్ బాలిక హత్యాచారం కేసు.. ప్రియుడే హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు
బాలిక తల్లే హత్య చేసి వేరేవారిపై నెట్టే ప్రయత్నం చేసిందంటూ.. మొదటగా అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే చివరికి ప్రియుడే.. పధకం ప్రకారం బాలికను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Vikarabad Girl Murder
Vikarabad Girl Murder : వికారాబాద్ జిల్లా అంగడిచిట్టంపల్లిలో.. పదోతరగతి బాలిక హత్యాచారం కేసు మిస్టరీని.. పోలీసులు చేధించారు. మైనర్ బాలికను .. తనతో చనువుగా ఉండే మహేందర్ అలియాస్ నాని హత్య చేసినట్లు తేల్చారు. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన ఈ కేసులో మొదట అనుమానితుడు నానీనే హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బాలిక తల్లే హత్య చేసి వేరేవారిపై నెట్టే ప్రయత్నం చేసిందంటూ.. అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే చివరికి ప్రియుడే .. పధకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సోమవారం ఉదయం 5.30 గంటలకు.. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకువెళ్లిన బాలిక.. ఎంతకీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. బాలిక కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కొద్దిసేపటికే నిర్మానుష్య ప్రాంతంలో ఓ బాలిక మృతదేహం పడివుందంటూ.. స్థానికులు చెప్పడంతో.. బాలిక తల్లి వెళ్లి చూసింది. మృతదేహాన్ని చూస్తూనే..అది తన కూతురిదేనంటూ .. కుప్పకూలిపోయింది.
Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య
అయితే.. గత కొన్ని రోజులుగా .. అదే గ్రామానికి చెందిన మహేందర్ అలియాస్ నానీ అనే వ్యక్తి .. తన కూతురిని వేధిస్తున్నాడని.. బాలిక తల్లి తెలిపింది. కొన్ని రోజులుగా ఫోన్ చేస్తున్నాడని చెప్పింది. మృతురాలి తల్లి చెప్పిన వివరాల ప్రకారం …నానీతో పాటు మరో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. తర్వాత బాలిక తల్లి తీరు అనుమానాస్పదంగా మారడంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఫైనల్‌గా ప్రియుడే బాలికను హత్యచేసినట్లు నిర్థారించారు.
ఈనెల 28న ఉదయం అంగడి చిట్టెంపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం హత్య చేసినట్టు ఫిర్యాదు అందిందని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. ఇందుకోసం టీమ్స్ ఫామ్ చేశాము.. 48 గంటల్లో నిందితుడిని గుర్తించామని చెప్పారు. మహేందర్ అనే వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని, అతను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని తెలిపారు. బాలికకు మహేందర్ కు సంవత్సర కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందన్నారు. ఈ ప్రేమ వ్యవహారం హత్యకు రెండు రోజుల ముందు మృతురాలి చెల్లెలకు తెలిసిందన్నారు. మృతురాలి చెల్లి ఈ విషయం ఇంట్లో చెప్పిందని.. దీంతో బాలికను తల్లి మందలించిందని తెలిపారు.
UP Crime : దళిత కుటుంబంలో నలుగురు హత్య..చంపేముందు బాలికపై గ్యాంగ్ రేప్
ఇక బయట కలుసుకోవడం కుదరదని భావించి హత్యకు ముందు రోజు కాల్ చేసి మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు బయట కలుద్దామని మాట్లాడుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉదయం మూడు, నాలుగు గంటల ప్రాంతంలో బాలిక బయటకు వచ్చిందన్నారు. మృతురాలిని తనతో ఫిజికల్ గా కలవాలి అంటూ మహేందర్ బలవంత పెట్టాడని తెలిపారు. బాలిక గట్టిగా ప్రతిఘటించింది..దీంతో మహేందర్ కు, ఆమెకు మధ్య పెనుగులాట జరిగిందని చెప్పారు.
ఈ పెనుగులాటలో బాలికను తోయడంతో ఆమె తల పక్కనే ఉన్న చెట్టుకు బలంగా తాకినట్లు పేర్కొన్నారు. దీంతో బాలిక స్పృహ కోల్పోయింది.. అది గమనించకుండా మహేందర్ ఆమెపై హత్యాచారం చేశాడని వెల్లడించారు. అత్యాచారం చేసిన అనంతరం బాలికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని తెలిపారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిని ఇవాళ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.