Police vehicle theft : సూర్యాపేట పోలీసులకు షాక్ ఇచ్చిన కంత్రీ.. పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీ

సూర్యాపేటలో ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడో దొంగ. సూర్యాపేట పట్టణ పీఎస్ కు సంబంధించిన వాహనాన్ని ఎత్తుకుపోయాడో దొంగ. కారుకు తాళం అలాగే ఉంచటంతో దాన్ని గమనించిన దొంగ చక్కగా కారుతో సహా ఉడాయించాడు. దీంతో పోలీసులు వాహనం కనిపించకపోవటంతో షాక్ అయ్యారు.

Police vehicle theft :  సూర్యాపేట పోలీసులకు షాక్ ఇచ్చిన కంత్రీ.. పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీ

Police vehicle theft IN Suryapet

Updated On : December 15, 2022 / 12:45 PM IST

Police vehicle theft : దొంగలు బాగా బరితెగించిపోయారు. పోలీసులంటే కూడా భయటపడటంలేదు. సూర్యాపేటలో ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడో దొంగ. సూర్యాపేట పట్టణ పీఎస్ కు సంబంధించిన వాహనాన్ని ఎత్తుకుపోయాడో దొంగ. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని కొత్త బస్టాండ్ వద్ద నిలిపి పక్కకు వెళ్లారు. ఇక్కడో విషయం మర్చిపోయారు పోలీసులు. కారుకు తాళం అలాగే ఉంచి దాన్ని అక్కడ నిలిపి ఉంచారు. అది గమనించాడో దొంగ. చక్కగా కారు తాళం తీసుకుని కారుతో సహా అక్కడ నుంచి ఉడాయించాడు. వేరే కేసు కోసం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అటు వెళ్లగా, వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు చోరీ చేశాడు.పోలీసుల కారును ఎవరు టచ్ చేస్తార్లే అనే పోలీసుల ధీమాతో కారుకే తాళాన్ని ఉంచేశారు. దీంతో దొంగగారి పని ఈజీ అయిపోయింది. వాహనానికే తాళం ఉండటంతో సులభంగా తీసుకెళ్లిపోయాడు.

బుధవారం (డిసెంబర్ 14,2022) తెల్లవారుజామున తెల్లారితే గురువారం అనగా 5 గంటలకు ఈ ఘటన జరిగింది. తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. వెతకటం మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద నిలిపి ఉంచిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా కారు తాళం తీసి ఉండటంతో ఈజీగా కారును చోరీ చేసిన సదరు దొంగ కోదడ వద్దకు వచ్చేసరికి వాహనంలో డీజిల్ అయిపోవటం ఆగిపోయింది. దీంతో దొంగ వాహనాన్ని అక్కడే వదిలేశాడు. ఈ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు పోలీసులు. సదరు దుండగుడి ఎటు వెళ్లాడు? అని పరిశీలించారు. అతడిని పట్టుకునే పనిలో పడ్డారు.