OYO Room: సెక్స్‌ వర్కర్లను తీసుకొచ్చి ఓయో రూమ్‌లో వ్యభిచారం

హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.41లో ఉన్న డాల్ఫిన్‌ హోటల్‌ ఓయో రూమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

OYO Room: సెక్స్‌ వర్కర్లను తీసుకొచ్చి ఓయో రూమ్‌లో వ్యభిచారం

Oyo Room

Updated On : May 22, 2021 / 4:59 PM IST

OYO Room:  హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.41లో ఉన్న డాల్ఫిన్‌ హోటల్‌ ఓయో రూమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో గురువారం రాత్రి దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో వ్యభిచార గృహా నిర్వాహకుడు అశ్విన్‌తో పాటు కస్టమర్లు రాహుల్‌సురాన(32) వెంకట అప్పయ్య దాసరి(44)లను అరెస్టు చేశారు. గ్వాలియర్‌, గుజరాత్‌లోని వడోదరకు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకోని పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా గతంలో జూబ్లీహిల్స్‌ లోని ఓ పార్లర్ లో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహించిన సంగతి విదితమే.