Chennai NGT : రాయలసీమ ఎత్తిపోతల పథకం, చెన్నై ఎన్జీటీ ధర్మాసనం విచారణ

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నై NGT ధర్మాసనం విచారించింది. ఈ విచారణనను వచ్చే నెల 08వ తేదీకి వాయిదా వేసింది.

Chennai NGT : రాయలసీమ ఎత్తిపోతల పథకం, చెన్నై ఎన్జీటీ ధర్మాసనం విచారణ

Ngt

Updated On : August 27, 2021 / 1:20 PM IST

Rayalaseema Upliftment Scheme : రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నై NGT ధర్మాసనం విచారించింది. ఈ విచారణనను వచ్చే నెల 08వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవలే ఎత్తిపోతల పథకం పనులను కృష్ణా నది యాజమాన్య బోర్డు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. తనిఖీల అనంతరం నివేదికను NGTకి సమర్పించింది KRMB. ఈ సందర్భంగా జరిగిన విచారణలో కేంద్రానికి పలు ఆదేశాలు జారీ చేసింది NGT.

Read More : Children Protect : వర్షాకాలంలో వ్యాధులనుండి పిల్లల రక్షణ ఎలాగంటే!..

రాయలసీమ ఎత్తిపోతల పనుల వల్ల జరుగుతున్న పర్యావరణ ముప్పుపై నివేదిక ఇవ్వాలని గతంలో NGT ఆదేశించింది. నివేదిక ఇచ్చేందుకు సమయం కావాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 08వ తేదీ వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీటీ తెలిపింది. సెప్టెంబర్ 08వ తేదీన అన్ని అంశాలు పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామని NGT చెన్నై ధర్మాసనం వెలువరించింది.

Read More : village’Built its own sun’: 3నెలలు సూర్యుడు ఉదయించని గ్రామం..వెలుగు కోసం ‘కొత్త సూర్యుడి’ సృష్టి

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్భించి అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించి నివేదించాలని గతంలో KRMB, కేంద్ర పర్యావరణ శాఖను NGTని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఎన్జీటీలో అఫిడవిట్ లో దాఖలు చేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నట్లు ఇటీవలే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.