Realtor Murder : హైదరాబాద్‌లో రియల్టర్‌ హత్య

హైదరాబాద్‌ తిరుమలగిరిలో రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి హత్యకు గురయ్యాడు. పెద్ద కమేళాలోని ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో ఓ కారులో చనిపోయి ఉన్నాడు.

Realtor Murder : హైదరాబాద్‌లో రియల్టర్‌ హత్య

Murder

Updated On : November 30, 2021 / 2:27 PM IST

realtor Vijayabaskar Reddy Murder : హైదరాబాద్‌ తిరుమలగిరిలో రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి హత్యకు గురయ్యాడు. పెద్ద కమేళాలోని ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో ఓ కారులో చనిపోయి ఉన్నాడు. నిన్న తిరుమలగిరిలో కారులో మృతదేహం లభ్యమైంది. మెడపై కత్తితో పొడిచిన గాయాలున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం..నిన్న ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయభాస్కర్‌.. ఓ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసమని తన వెంట రూ.10లక్షలు తీసుకెళ్లాడు. ఉదయం 11 గంటలకు విజయభాస్కర్ రెడ్డిని హత్య చేసినట్లు తెలుస్తోంది.

Road Accident : పాదచారులను మెరుపువేగంతో ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

విజయభాస్కర్‌ ది అనుమానాస్పద మృతిగా మొదటగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు కొనసాగించారు. కానీ మెడపై కత్తితో పొడిచిన గాయాలు, కుటుంబ సభ్యులు అనుమానాలు, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యగా కేసు నమోదు చేసుకున్నారు.

అయితే ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ మధ్యవర్తులే విజయభాస్కర్‌ను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మృతుని బంధువు తోట నరేందర్‌ రెడ్డితో పాటు మరో వ్యక్తి అబ్రహాంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.