Revanth Reddy : కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చారు, కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుంది : రేవంత్ రెడ్డి
కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని కానీ 4కోట్లమంది ప్రజలను మోసాగించినట్లే కేసీఆర్ సోనియాగాంధీని మోసం చేశారు అంటూ విమర్శించారు.

Revanth Reddy
Revanth Reddy ..CM KCR : గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ కేసీఆర్ సోనియాగాంధీని మోసం చేశారు అంటూ విమర్శించారు.కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని కానీ 4కోట్లమంది ప్రజలను మోసాగించినట్లే కేసీఆర్ సోనియాగాంధీని మోసం చేశారు అంటూ విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని..అందుకే సెప్టెంబర్ 17న సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారని వెల్లడించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని హామీ ఇచ్చారు.
తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని..కాంగ్రెస్ ఏం చేసిందంటూ బిల్లా రంగాలు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారని..ఘాటు విమర్శలు చేశారు.వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ కాదా?రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చింది కాంగ్రెస్సే అని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందించింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కేటీఆర్.. మీరు అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్ పెట్టిన బిక్ష.. సోనియమ్మ దయ..అంటూ దుయ్యబట్టారు. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు.
Bhatti Vikramarka : ఆరు గ్యారెంటీలు ఆరు నెలల్లోపే అమలు చేస్తాం : భట్టి విక్రమార్క
డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నవారిపై నిఘా పెట్టారని…కాంగ్రెస్ నాయకుల ఫోన్ లపై నిఘా పెట్టారని ఆరోపించారు.కాంగ్రెస్ కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ కు వార్నింగ్ ఇస్తు..‘‘కాంగ్రెస్ కు సాయం చేస్తున్న 75 మంది లిస్టును తయారు చేశారట… ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఇచ్చారు..కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారట కానీ బిడ్డా కేటీఆర్.. గుర్తు పెట్టుకో..నీ అధికారం 45రోజులే ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తాం’’అంటూ వార్నింగ్ ఇచ్చారు.
అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు.అధికారులు అధికారుల్లా వ్యవహరించండి… బీఆరెస్ కార్యకర్తల్లా కాదు.కాంగ్రెస్ కార్యకర్తలారా 45రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదే..డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం అని ధీమా వ్యాక్తంచేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం..ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయం..అనిఅన్నారు.అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్ లా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.నన్ను భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారు..భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధం… మీరు సిద్ధంగా ఉన్నారా.. అంటూ సవాల్ విసిరారు.