Revanth Reddy : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలిస్తాం-రేవంత్ రెడ్డి

2024 జనవరిలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 317 జీవోను రద్దు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్ని సమస్యలకు కేసీఆర్ కారణం అని ధ్వజమెత్తారు.

Revanth Reddy : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలిస్తాం-రేవంత్ రెడ్డి

Updated On : February 8, 2023 / 11:13 PM IST

Revanth Reddy : మహబూబాబాద్ జిల్లా జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ దేవాలయం ముందు హాత్ సే హాత్ జోడో యాత్ర కార్నర్ మీటింగ్ లో టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 అడుగుల గోతిలో పెట్టాలన్నారు. పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read..Bandi Sanjay: రామరాజ్య స్థాపన కోసమే బీజేపీ 11 వేల కార్నర్ మీటింగ్స్: బండి సంజయ్

కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వాపోయారు. ఆర్టీసీ ఉద్యోగులను యాజమాన్యం వేధిస్తోందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని దుశ్శాసనుడితో పోల్చారు రేవంత్ రెడ్డి. కలెక్టర్ ను చేయి పట్టి గుంజిన నీచుడు ఎమ్మెల్యే ఎంకర్ నాయర్ అని మండిపడ్డారు. అడ్డు వచ్చిన కౌన్సిలర్ ను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంతమొందించాడని ఆరోపించారు. మెడికల్ కాలేజీ పేరుతో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత చెరో పక్క భూములు కొల్లగొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read..Revanth Padayatra Protest : రేవంత్ రెడ్డి పాదయాత్రకు నిరసన సెగ.. ములుగు, నర్సంపేట పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు

నకిలీ విత్తనాలతో 29మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 26మంది గిరిజన రైతులే అని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. 2024 జనవరిలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 317 జీవోను రద్దు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్ని సమస్యలకు కేసీఆర్ కారణం అని ధ్వజమెత్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

” రాష్ట్రంలో ఎక్కడ రేప్ కేసులు జరిగినా టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. రాష్ట్రంలో శాండ్, మైన్, వైన్ దందాలు అన్నీ టీఆర్ఎస్ నాయకులే చేస్తున్నారు. ప్రగతి భవన్ లోకి సామాన్యులకు ఎందుకు పర్మిషన్ లేదు. ప్రగతి భవన్ గడీల గేట్లను బద్దలు కొడతాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి” అని రేవంత్ రెడ్డి అన్నారు.