TPCC : టీపీసీసీ చీఫ్‌‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2021, జూలై 07వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

TPCC : టీపీసీసీ చీఫ్‌‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు

Revanth Reddy Takes Charge As Tpcc Chief

Updated On : July 7, 2021 / 2:23 PM IST

Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2021, జూలై 07వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు..పూజారుల చేత ఆశీర్వచనాలు తీసుకున్నారు.

Read More : Mumbai: కొవిడ్-19, బ్లాక్ ఫంగస్, ఊపిరితిత్తుల నుంచి రక్తం.. అయినా 85రోజులు పోరాడి గెలిచిన వ్యక్తి
బుధవారం ఉదయం..పెద్దమ్మ గుడిలో వేద పండితుల సమక్షంలో జరిగిన ప్రత్యేక పూజలకు హాజరయ్యారు రేవంత్ రెడ్డి. తన నివాసానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానులు, భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గాంధీభవన్‌కు రేవంత్ ర్యాలీగా బయల్దేరారు. టపాసులు కాలుస్తూ..అభిమానులు స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి జిందాబాద్, జై కాంగ్రెస్ నినాదాలతో మారుమోగింది. అభినందనలను స్వీకరిస్తూ రేవంత్ ముందుకు కదిలారు.

రేవంత్ వెంట ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. Revanth Oath Ceremony: కాంగ్రెస్ ఎంపీ.. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోనున్న రేవంత్ ప్రజా సమక్షంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ర్యాలీగా కదలి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు నాంపల్లిలోని గాంధీ భవన్ కు చేరుకున్న అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.

Read More : IRCTC : ‘చార్‌ ధామ్‌ యాత్ర’కు ప్రత్యేక రైలు..ఆధునిక సౌకర్యాలతో కూల్ కూల్ టూర్