Secunderabad violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వసం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వసం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. విధ్వంసానికి అసలు కారకులు ఎవరో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ప్రయివేటు డిఫెన్స్ అకాడమీల పాత్ర పై ఆరా తీస్తున్నారు

Secunderabad violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వసం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

Secundrabad (1)

Updated On : June 21, 2022 / 1:30 PM IST

Secunderabad violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వసం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. విధ్వంసానికి అసలు కారకులు ఎవరో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ప్రయివేటు డిఫెన్స్ అకాడమీల పాత్ర పై ఆరా తీస్తున్నారు. నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఐబీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు సమక్షంలో తనిఖీలు చేశారు. ఇదిలాఉంటే సోమవారం మధ్యాహ్నం 2గంటల నుంచి సుబ్బారావు ను అధికారులు విచారిస్తున్నారు.

Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

మరోవైపు విధ్వంసానికి ప్రత్యక్షంగా పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిగ్నమయ్యారు. వాట్సప్ చాటింగ్, కాల్ రికార్డింగ్స్ , సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విధ్వసం కుట్ర వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు అన్న కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ విధ్వంసం వెనుక 16కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని రైల్వే పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆదోళనకారుల నుండి 10కి పైగా వాట్సప్ గ్రూప్ ల గుర్తించారు. వాట్సప్ చాటింగ్ వివరాలను సిట్ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

BEAR ATTACK: హమ్మయ్య దొరికింది.. ఎలుగు బంటిని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.. జూకు తరలింపు

ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘనటలో భాగస్వాములుగా ఉన్న 15మందిని గుర్తించిన పోలీసులు వారి అదుపులోకి తీసుకున్నారు. మరో 25మంది పాత్ర ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 56మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టుల సంఖ్య వంద వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.