అలా చేయాలని చూస్తే.. టీడీపీ గల్లంతయ్యే అవకాశం ఉంది- విజయశాంతి వార్నింగ్

అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబుకి.. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తాం అని అనాల్సిన అవసరం ఏమున్నది?

అలా చేయాలని చూస్తే.. టీడీపీ గల్లంతయ్యే అవకాశం ఉంది- విజయశాంతి వార్నింగ్

Vijayashanthi (Photo Credit : Facebook)

Updated On : July 8, 2024 / 11:00 PM IST

Vijayashanthi : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి భేటీని ఉద్దేశించి విజయశాంతి ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ”ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు వచ్చారని అందరూ భావించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది.

తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడటానికి కుట్రలు చెయ్య ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే
అవకాశాలు ఉన్నాయి. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం” అని విజయశాంతి ట్వీట్ చేశారు.

అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబుకి.. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తాం అని అనాల్సిన అవసరం ఏమున్నది? వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన బాగుంది, మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు విజయశాంతి.

Also Read : షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ అధికారంలో ఉన్నది బీజేపీనే- ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు