Apsara Case: అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు.. ఆమె నిద్రపోతున్న సమయంలోనే పూజారి..

బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. తరచూ అప్సరకు వాట్సప్ ద్వారా మెసేజులు పంపేవాడు పూజారి.

Apsara Case: అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు.. ఆమె నిద్రపోతున్న సమయంలోనే పూజారి..

Apsara case

Apsara Case – Crime: హైదరాబాద్ (Hyderabad) లో పూజారి చేతిలో అతి దారుణంగా హత్యకు గురైన అప్సర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 టీవీ చేతిలో అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్ ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి పూజారి సాయి కృష్ణకు ఆమెతో పరిచయం ఏర్పడింది.

బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. తరచూ అప్సరకు వాట్సప్ ద్వారా మెసేజులు పంపేవాడు పూజారి. గత ఏడాది నవంబర్‌లో గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సందర్శించారు సాయి కృష్ణ , అప్సర. గుజరాత్ వెళ్లిన తర్వాత వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది.

వాట్సాప్ ద్వారా లవ్ ప్రపోజ్ చేసింది ఆమె. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే సాయి కృష్ణను రోడ్డుకు ఈడుస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో ఆమె అడ్డును తొలగించుకునేందుకే హత్య చేశాడు పూజారి. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో పలు అంశాలను శోధించాడు.

” మనిషిని ఎలా హత్య చేయొచ్చు ” అని గూగుల్లో టైప్ చేసి వెతికాడు. తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని పలుమార్లు సాయి కృష్ణను అప్సర కోరడంతో టూర్ కు తీసుకెళ్తానంటూ ఆమెను తీసుకెళ్లాడు. ఈ నెల 3వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించాడు.

సాయి కృష్ణ మాటలు నమ్మి సరూర్ నగర్ కు వచ్చింది ఆమె. కార్ లో ఆమెతో కలిసి బయలుదేరిన సాయికృష్ణ శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్నాడు. తర్వాత టికెట్ బుక్ చేయలేదని ఆమె చెప్పాడు. అక్కడి నుంచి గోశాలకి వెళ్తున్నట్టు చెప్పాడు. డిన్నర్ కోసం రాళ్లగూడ వద్ద ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు.

అప్పటికే ఒకసారి ఆరోగ్యం బాగోలేక వాంతి చేసుకుంది ఆమె. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డిన్నర్ చేసిన సాయి కృష్ణ.. అర్ధరాత్రి 12 గంటలకి సుల్తాన్ పల్లి లో ఉన్న గోశాల వద్దకు చేరుకున్నాడు. తెల్లవారుజామున 3.50 గంటలకు వెంచర్ సైడ్ వెళ్లారు. ఆమె నిద్రలో ఉన్న సమయంలోనే సాయి కృష్ణ హత్య చేశాడు.

Pakistani aircraft-shaped balloon: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ విమాన ఆకార బెలూన్ లభ్యం