Shilpa Chowdhury : జైలు నుంచి విడుదలైన శిల్పాచౌదరి..షరతులు ఇవే

ఎవరితోనూ ఫోన్‌లో కానీ, డైరెక్ట్‌‍గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని...సాక్షులను బెదిరించరాదని.. కోర్టు ఆదేశించింది.

Shilpa Chowdhury : జైలు నుంచి విడుదలైన శిల్పాచౌదరి..షరతులు ఇవే

Shilpa Chowdary

Updated On : December 24, 2021 / 9:46 AM IST

Shilpa Chowdhury Case: దాదాపు 25 రోజుల పాటు జైల్లో ఉన్న శిల్పాచౌదరి.. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైంది. పలుమార్లు బెయిల్ పిటిషన్‌లను కోర్టులు తిరస్కరించగా.. లేటెస్ట్‌గా గురువారం ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆమె 2021, డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయింది. శిల్పాచౌదరికి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 10వేల రూపాయల చొప్పున ష్యూర్టీలు సమర్పించాలని చెప్పింది. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం చేయొద్దని .. నిబంధన విధించింది. ఎవరితోనూ ఫోన్‌లో కానీ, డైరెక్ట్‌‍గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని…సాక్షులను బెదిరించరాదని.. కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతీ శనివారం నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని తెలిపింది.

Read More : Omicron Death : జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

శిల్పా చౌదరి.. ఆమె భర్తపై నార్సింగి పోలీసులకు ముగ్గురు బాధితులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమ దగ్గర్నుంచి శిల్పా చౌదరి కోట్ల రూపాయలు తీసుకుందని.. డబ్బు తిరిగివ్వాలని అడిగితే బెదిరిస్తోందని కంప్లైంట్‌ ఇచ్చారు. దీంతో నార్సింగి పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్‌ చేసి లోతుగా విచారిస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. శిల్పా చౌదరి తమను మోసం చేసిందంటూ రోహిణిరెడ్డి, దివ్యారెడ్డితో పాటు మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని కూడా కంప్లైంట్‌ చేశారు. శిల్పా చౌదరికి రోహిణిరెడ్డి 3 కోట్ల పది లక్షలు ఇస్తే.. ప్రియదర్శిని 2 కోట్ల 90 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. దివ్యారెడ్డి కోటీ 5 లక్షలు ఇచ్చినట్లు, మొత్తం ఈ ముగ్గురి నుంచి మొత్తం 7 కోట్ల 5 లక్షలు వసూలు చేసినట్లు శిల్పా చౌదరిపై ఆరోపణలున్నాయి. ముగ్గురు బాధితులు నార్సింగి పోలీసుల్ని ఆశ్రయించారు. వీరే కాకుండా చాలామంది హైప్రొఫైల్‌ మహిళలు కూడా శిల్పా డబ్బిచ్చినట్లు తెలుస్తోంది. అయితే అదంతా బ్లాక్‌మనీ కావడంతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేకపోతున్నారని టాక్.

Read More : US Cruise Ship : యూఎస్ క్రూయిజ్ షిప్‌లో 58 మందికి కొవిడ్ పాజిటివ్

శిల్పా ఇచ్చినవన్నీ నకిలీ చెక్కులని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. ఆ తర్వాత శిల్పా ఇచ్చిన గోల్డ్‌ చెయిన్‌ కూడా నకిలీదేనని తేలడంతో లబోదిబోమంటూ నార్సింగి పోలీసుల్ని ఆశ్రయించారు ప్రియదర్శిని. మరోవైపు రోహిణిరెడ్డి కూడా శిల్పా గురించి షాకింగ్‌ విషయాల్ని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. శిల్పా చౌదరితో ఎవరైనా గంటసేపు మాట్లాడితే ట్రాప్‌లో పడిపోతారని.. తాను కూడా అలాగే మోసపోయానని చెప్పింది. దీంతో హైప్రొఫైల్‌ మహిళల్ని శిల్పా చౌదరి ఎలా ట్రాప్‌ చేసి డబ్బు దండుకుంటుందో పోలీసులకు క్లారిటీ వచ్చింది.

Read More : Radheshyam : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఫన్నీ స్పీచ్.. నాకు సిగ్గేస్తుంది బాబో..!

అనంతరం శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని… బ్యాంకు లాకర్లను తెరిచారు. అయితే అందులో నగదు లభ్యం కాలేదు. కస్టడీ పూర్తి కావడంతో బుధవారం ఉదయం ఉప్పర్‌పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు ప్రవేశ పెట్టారు. దీంతో శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు. అయితే ప్రముఖుల నుంచి వసూలు చేసిన డబ్బులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టుగా శిల్పా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించారని సమాచారం. ఆమెపై నమోదైన మూడు కేసుల్లో ఇదివరకే ఒక కేసులో బెయిల్‌ మంజూరైంది. మిగిలిన రెండు కేసుల్లోనూ తాజాగా బెయిల్‌ ఇచ్చింది ఉప్పర్ పల్లి కోర్టు.