Srushti Fertility Centre Case: సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్.. సృష్టి కేసులో వెలుగులోకి మరిన్ని దారుణాలు..
ఆ వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచినట్లు గుర్తించారు.

Srushti Fertility Centre Case: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. ఇటు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు చెప్పారు. 86 మంది సరోగసి దంపతుల వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందంటూ పిటిషన్ లో తెలిపారు. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై విచారించాలని వివరించారు.
సృష్టి అకృత్యాలు మరిన్ని వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహాకురాలు డాక్టర్ నమ్రత కేసులో అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కన్సల్టెంట్ గా పని చేసిన డాక్టర్ లెటర్ హెడ్ లను నమత్ర వినియోగించినట్లు తెలిసింది. ఆ వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచినట్లు గుర్తించారు. తన పేరుతో లెటర్ హెడ్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నమ్రతపై మరో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
Also Read: బ్యాంకు బాత్రూమ్‌లో ఉద్యోగి ఆత్మహత్య.. అనంతపురంలో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్