Statue of Equality : ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ.. నగరవాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ కార్యక్రమాలు తిలకించేందుకు నగర వాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముచ్చింతల్ ఆశ్రమానికి..

Statue Of Equality
Statue of Equality : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి భగవద్రామానుజల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ” ఆవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. ముచ్చింతల్ గ్రామంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణం భారీ ఏర్పాట్లకు వేదికైంది. ఫిబ్రవరి 2న అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో 3వ తేదీ అగ్నిప్రతిష్ఠ జరుగుతుంది. 5వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘సమతామూర్తి’ మహా విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు.
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటిని తిలకించేందుకు నగర వాసుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముచ్చింతల్ కు బస్సులు నడపనున్నారు. వాటికి సంబంధించిన వివరాలను గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వేంకటేశ్వర్లు తెలిపారు.
Union Budget 2022: బడ్జెట్ తర్వాత బూట్లు, బట్టల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయో తెలుసా?
పలు ప్రాంతాల నుంచి ముచ్చింతల్ క్యాంపుకి బస్సులు..
* పఠాన్ చేరు లింగంపల్లి- గచ్చిబౌలి శంషాబాద్- ముచ్చింతల్ క్యాంపు
* KPHB కూకట్ పల్లి SR నగర్ – పంజాగుట్ట -మెహిదీపట్నం ఆరాంఘర్ – ముచ్చింతల్ క్యాంపు
* మేడ్చల్ – కొంపల్లి- బాలానగర్ – మెహిదీపట్నం- ఆరాంఘర్ష్ – ముచ్చింతల్ క్యాంపు
* అల్వాల్-JBS-RTC X రోడ్డు అఫల్ గంజ్ జూపార్క్ ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంపు
* ఘట్ కేసర్ – ఉప్పల్- LB నగర్ – మిధాని ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంప్
* ECIL – తార్నక- ఫీవర్ హాస్పిటల్ నారాయణగూడ లక్డీకాపూల్- మెహిదీపట్నం
* ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంపు హయత్ నగర్ – దిల్ సుఖ్ నగర్ MGBS – ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంపు
* కాచిగూడ రైల్వేస్టేషన్ అఫ్జల్ గంజ్ జూ పార్క్ ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంపు
* నాంపల్లి రైల్వే స్టేషన్ అఫ్జల్ గంజ్ జూ పార్క్ ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంపు
* సికంద్రాబాద్ రైల్వే స్టేషన్ RTC రోడ్- ఫీవర్ హాస్పిటల్ అఫ్జల్ గంజ్ జూ పార్క్ – ఆరాంఘర్ ముచ్చింతల్ క్యాంపు
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్ దివ్య క్షేత్రం ముస్తాబైంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఎందరో ప్రముఖులు పాల్గొనబోతున్నారు.
శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సంకల్పంతో ముచ్చింతల్ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి కోట్ల రూపాయలతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2వేల 700 మంది శిల్పులు పాల్గొన్నారు.
High Court: ఉద్యోగస్తుల నుంచి రికవరీ చేయొద్దు.. పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!
ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. తొమ్మిది నెలల పాటు శ్రమించి..1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులొచ్చి విగ్రహ రూపునిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకొని వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
సమతామూర్తి విగ్రహాన్ని పలు భాగాల కోణంలో చూస్తే.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, శ్రీరామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఈ సమతామూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం.
మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు వేదికను సిద్ధం చేశారు. ఈ గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు.
ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 3:30 గంటలకు సమతామూర్తి మహా విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. 13వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. ప్రధానాలయంలోని నిత్యపూజామూర్తి బంగారు విగ్రహానికి తొలి పూజ చేయడం ద్వారా ఆవిష్కరిస్తారు. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు వస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగశాలల్లో 1035 హోమగుండాలను సిద్ధం చేశారు. హోమంలో రెండు లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తున్నారు.