Telangana BJP: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం.. పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు నియామకం..

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ అదిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో జిల్లాల అధ్యక్షుల నియామకంపై ఫోకస్ పెట్టింది

Telangana BJP: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం.. పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు నియామకం..

Telangana BJP

Updated On : February 3, 2025 / 12:40 PM IST

Telangana BJP: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ అదిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటిన ఆ పార్టీ.. రాబోయే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తిచేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం.. జిల్లాల వారిగా పార్టీ అధ్యక్షుల ఎంపికపై దృష్టిసారించింది. అయితే, తాజాగా పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేసినట్లు తెలిస్తుంది. జిల్లా అధ్యక్షులుగా ఎంపికైన వారికి వ్యక్తిగతంగా నియామక పత్రాలను రాష్ట్ర నాయత్వం పంపించినట్లు సమాచారం.

Also Read: Ponguleti Srinivas Reddy : పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..

జిల్లా అధ్యక్షులుగా ఎంపికైన వారిలో..
హైదరాబాద్ : లంకల దీపక్ రెడ్డి
భూపాలపల్లి – నిశిధర్ రెడ్డి
కామారెడ్డి – నీలం చిన్నరాజులు
హన్మకొండ – కొలను సంతోష్ రెడ్డి
వరంగల్ – గంట రవికుమార్
నల్గొండ – నాగం వర్షిత్ రెడ్డి
నిజామాబాద్ – దినేశ్ పటేల్ కులచారి
వనపర్తి – దుప్పల్లి నారాయణ

 

జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించిన తరువాత రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైనా అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో కొత్తవారికి పార్టీ పగ్గాలను అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరికి బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.