Bandi Sanjay Kumar: రాష్ట్రపతిని ఓడించే ప్రయత్నంచేసి అవమానపర్చింది ఇవే ప్రతిపక్షాలు.. అవసరమైతే మళ్లీ ప్రమాణం చేస్తా

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ అదే బీఆర్ఎస్‌లోకి వెళ్తారు. ఇప్పటికీ మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలుకూడా అటో ఇటో అన్నట్టుగా ఉన్నారు.

Bandi Sanjay Kumar: రాష్ట్రపతిని ఓడించే ప్రయత్నంచేసి అవమానపర్చింది ఇవే ప్రతిపక్షాలు.. అవసరమైతే మళ్లీ ప్రమాణం చేస్తా

Bandi Sanjay Kumar

Updated On : May 26, 2023 / 12:10 PM IST

Telangana BJP President: ఈనెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడంపై, ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ 20 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం విధితమే. ఈ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి‌ని ఓడగొట్టె ప్రయత్నంచేసి అవమానపరిచింది ఇవే ప్రతిపక్షాలు. ఇప్పుడు పార్లమెంట్ భవనం ప్రారంభం‌పై రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు. అప్పుడు మహిళ అని చూడకుండా అవమానపరిచి ఇప్పుడు ఇలా రాజకీయం చేయడం సిగ్గుచేటు. స్పీకర్ నిర్ణయం ప్రకారమే ఏ కార్యక్రమమైన జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.

Assam : ఇది థర్డ్ డిగ్రీ ప్రయోగించే కాలం కాదు : హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

వైఫల్యాలు చర్చకు రాకుండా.. 

తెలంగాణ‌లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.. కానీ దశాబ్ధి ఉత్సవాలకు 150 కోట్ల ప్రకటనలు ఇచ్చారంటూ సంజయ్ మండిపడ్డారు. వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండేందుకే ఈ ఉత్సవాల పేరుతో సీఎం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ‌లోను లిక్కర్ దందా జరిగిందని సంజయ్ ఆరోపించారు. ఇందులోనూ కేసీఆర్ కుటుంబం ఉందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్‌లో చేసినవారు తెలంగాణలో చేయలేరా? అని సంజయ్ అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణలోను లిక్కర్ దందాపై విచారణ జరపాలని అన్నారు. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదని, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నారని ఈ దశాబ్ది ఉత్సవాలు అంటూ సంజయ్ ప్రశ్నించారు.

India Rs.75 Coin : నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. రూ.75 కాయిన్ ను విడుదల చేయనున్న కేంద్రం

వాళ్లు గెలిస్తే మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తారు.. 

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ అదే బీఆర్ఎస్‌లోకి వెళ్తారు. ఇప్పటికీ మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలుకూడా అటో ఇటో అన్నట్టుగా ఉన్నారు. కర్ణాటక‌లో కాంగ్రెస్ గెలిస్తే గాంధీ భవన్‌లో తప్ప ఎక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లేరు. తెలంగాణ బీజేపీలోని నేతల మధ్య వర్గవిభేదాలు ఉన్నట్లు ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవని సంజయ్ అన్నారు. ప్రజలకోసం పోరాటం చేస్తున్న బీజేపీకి మీడియా యాజమాన్యాలు సహకరించాలని సంజయ్ కోరారు.

గ్రానైట్‌తో నాకు సంబంధం లేదు .. 

గ్రానైట్‌తో నాకు సంబంధం ఉందనడం ఆరోపణ మాత్రమేనని సంజయ్ అన్నారు. గ్రానైట్‌తో సంబంధం లేదని గతంలోనే అమ్మవారు ముందు ప్రతిజ్ఞ చేశా. మళ్ళీ చేయమన్న చేస్తా. గ్రానైట్‌లో ఐదు వందలమంది వ్యాపారులు ఉన్నారు. ఇందులో BRS, కాంగ్రెస్, బీజేపీ సపోర్టర్స్‌కూడా ఉన్నారని సంజయ్ తెలిపారు. నేను డబ్బులు తీసుకుంటే వాళ్ళు బయటకి రాకుండా ఉంటారా అంటూ సంజయ్ అన్నారు.