Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్

బీజేపీ సభ్యులు మాత్రం నల్ల కండువాలు ధరించి వచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా

Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్

BJP MLA's

Updated On : March 7, 2022 / 3:45 PM IST

BJP MLAs Suspended : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ (2022-23) సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభకు టీఆర్ఎస్ సభ్యులు పార్టీ కండువా కప్పుకుని రాగా.. బీజేపీ సభ్యులు మాత్రం నల్ల కండువాలు ధరించి వచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండటాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

Read More : Telangana Budget : కేంద్రం వివక్ష చూపిస్తోంది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు

ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తుండగా.. బీజేపీ సభ్యులు ఆందోళన, నినాదాలు చేయడం ప్రారంభించారు. వారు నినాదాలు ఆపకపోవడంతో బీజేపీ సభ్యులపై (రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజందర్ రావు)లపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. బడ్జెట్ సెషన్ అంతా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తీర్మానం చదివారు. తీర్మానం ఆమోదం పొందడంతో బీజేపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.

Read More : Telangana Budget: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్..!

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను సమర్పించారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఉండగా.. ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కానుంది. కోవిడ్ నిబంధనల మేరకు సమావేశాలకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత సభ ప్రారంభమైన ఫస్ట్ డే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.