Telangana Cabinet: మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ కసరత్తు పూర్తి.. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన

తెలంగాణలో మంత్రి యోగం ఎవరికి దక్కనుంది. సామాజిక వర్గాల వారిగా ఛాన్స్ ఇస్తారా.. లేకుంటే సీనియార్టీ ప్రకారం లెక్కలోకి తీసుకుంటారా..

Telangana Cabinet: మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ కసరత్తు పూర్తి.. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన

Telangana Cabinet Expansion

Updated On : March 25, 2025 / 2:22 PM IST

Telangana Cabinet: తెలంగాణలో మంత్రి యోగం ఎవరికి దక్కనుంది. సామాజిక వర్గాల వారిగా ఛాన్స్ ఇస్తారా.. లేకుంటే సీనియార్టీ ప్రకారం లెక్కలోకి తీసుకుంటారా.. ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన కార్యవర్గం ప్రకటన, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏఐసీసీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం విస్తరణలో భాగంగా ఎవరెవరు చోటుదక్కించుకోబోతున్నారన్న విషయంపై ఏ క్షణమైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: భూ భారతి చట్టం రూల్స్, ఎల్ఆర్ఎస్ గడువు పెంపుపై కీలక అప్‌డేట్‌.. మంత్రి పొంగులేటి ఏమన్నారంటే..

ఉగాదిలోపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల నుంచి సమగ్ర సమాచారం తీసుకున్న ఏఐసీసీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ అనంతరం పీసీసీ కార్యవర్గం ప్రకటన, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే, మంత్రివర్గ విస్తరణలో నలుగురు లేదా ఐదుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, జిల్లాలు, నియోజకవర్గాలు, ఎన్నికల ముందు నేతలకు ఇచ్చిన హామీల ఆధారంగా మంత్రుల ఎంపిక ఉంటుందని సమాచారం.

Also Read: AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వాళ్లకు స్కీం పక్కా..

మంత్రివర్గం రేసులో వాకిటి శ్రీహరి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, విజయశాంతి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామచంద్ర నాయక్, అమీర్ అలీఖాన్ ఉన్నారు. వీరిలో ఎవరికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారనేది కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను రేపుతుంది.