Cabinet Sub Committee : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ.. పలు కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది.

Cabinet Sub Committee
Cabinet Sub Committee : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. జిల్లాలలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్లను ఆదేశించింది. 58, 59 జీవోల కింద దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్ధీకరించాలని కూడా నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక అంశాలపై చర్చించింది. ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటి స్థలం ఉన్నవారికి రూ. 3లక్షలు ఇవ్వడంతో పాటు ధరణి సమస్యలపై లోతుగా చర్చించింది.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పైన సమీక్ష నిర్వహించింది. కేబినెట్ సబ్ కమిటీ హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల వారిగా ప్రభుత్వ భూముల వివరాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మాలని సబ్ కమిటీ నిర్ణయించింది. 2023-24 లో కొత్తగా లక్షా 38 వేల 87 ఇళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. తెలంగాణలో సొంత స్థలం కలిగిన వారికి ఇళ్లు కట్టుకోవడానికి 3లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో హంగ్ ఖాయం.. కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగడటం పొలిటికల్ డ్రామా
4లక్షల మంది లబ్ధిదారులకు అందించేందుకు బడ్జెట్ ను కేటాయించింది. దీనిపై విధి విధానాలను పూర్తి స్థాయిలో రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. 58, 59 జీవోల కింద అప్లికేషన్ చేసుకున్న వారికి పట్టాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ధరణి సమస్యలను పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వచ్చే మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ మళ్లీ భేటీ కానుంది. ఈ భేటీలో ఇళ్ల స్థలాలు ఉన్న వారికి 3 లక్షల రూపాయలు ఇవ్వడంపై విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది.