YS Sharmila : టీకాంగ్రెస్ లో షర్మిల కల్లోలం.. తెలంగాణలో షర్మిల రాజకీయానికి నో చెబుతున్న రేవంత్

షర్మిల పార్టీ విలీనంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తో చర్చించే బాధ్యత శివకుమార్ కు అప్పగించారు.

YS Sharmila : టీకాంగ్రెస్ లో షర్మిల కల్లోలం.. తెలంగాణలో షర్మిల రాజకీయానికి నో చెబుతున్న రేవంత్

Operation YS Sharmila

Telangana Congress – YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల కల్లోలం రేగింది. బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ షర్మిల ప్రారంభించారు. షర్మిల పార్టీ విలీనం దిశగా వేగంగా పావులు కదులుతున్నాయి. షర్మిల పార్టీ విలీనంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తో చర్చించే బాధ్యత శివకుమార్ కు అప్పగించారు. శివకుమార్ తో రేవంత్ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై బెంగళూరులో కీలక భేటీ అయ్యారు.

పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చర్చల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లారు. తెలంగాణలోనే రాజకీయం చేసే యోచనలో షర్మిల ఉన్నారు. తెలంగాణలో షర్మిల రాజకీయానికి రేవంత్ రెడ్డి నో చెబుతున్నారు. ఏపీ రాజకీయాలకే షర్మిలను పరిమితం చేయాలని అంటున్నారు. అవసరమైతే ఎన్నికల తర్వాత షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానానికి సూచించారు. ఎన్నికలకు ముందే చేర్చుకుంటే కేసీఆర్ కు షర్మిల అస్త్రంగా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

YS Sharmila : అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? షర్మిలతో జగన్‌ను దెబ్బకొట్టనుందా?

పాలేరులో పోటీ చేస్తానని గతంలో షర్మిల ప్రకటించారు. షర్మిలకు చెక్ పెట్టేందుకు రేవంత్.. తుమ్మల నాగేశ్వరరావును తెరపైకి తెచ్చారు. నిన్న సోనియా, రాహుల్ గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. షర్మిల రాజకీయ భవిష్యత్ పై సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలకు జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.

తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో షర్మిల కీ రోల్ గా ఉన్నారు. రెండేళ్లుగా తాను చేసిన పోరాటాలను షర్మిల సోనియాకు వివరించారు. కాంగ్రెస్ బలోపేతానికి పార్టీ విలీనం చేసేందుకు సిద్ధమని షర్మిల అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా రేపే పార్టీ విలీనానికి షర్మిల సిద్ధమైంది. అయితే రాహుల్ గాంధీ షెడ్యూల్ బిజీగా ఉండటంతో పార్టీ విలీనం వాయిదా పడింది.