Telangana Corona : తెలంగాణలో 4వేలకు చేరువగా కరోనా కొత్త కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 4వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71వేల 070 నమూనాలు పరీక్షించగా.. 3వేల 837 కేసులు నమోదయ్యాయి. మరో 25మంది కరోనాతో చనిపోయారు.

Telangana Corona : తెలంగాణలో 4వేలకు చేరువగా కరోనా కొత్త కేసులు

Corona Telangana

Updated On : May 19, 2021 / 8:08 PM IST

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 4వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71వేల 070 నమూనాలు పరీక్షించగా.. 3వేల 837 కేసులు నమోదయ్యాయి. మరో 25మంది కరోనాతో చనిపోయారు. 4వేల 976 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 594 కొత్త కేసులు రాగా.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 265, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 239, ఖమ్మం జిల్లాలో 227 చొప్పున నమోదయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,42,67,002 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,40,603మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 4,90,620మంది కోలుకోగా.. 3వేల 37మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 46,946 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 90.75శాతం కాగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మే 19,2021) బులెటిన్ విడుదల చేసింది.

జిల్లాల వారీగా కరోనా కేసులు: