Telangana New Government : రేపే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..? సీఎం రేసులో ఆ ఇద్దరు..!

రేపే ప్రభుత్వ బాధ్యతలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

Telangana New Government : రేపే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..? సీఎం రేసులో ఆ ఇద్దరు..!

Telangana New Government

Updated On : December 3, 2023 / 5:57 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అప్పుడే సన్నాహకాలు మొదలు పెట్టింది. రేపు(డిసెంబర్ 4) ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నట్లు సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం సీఎల్పీ సమావేశం నిర్వహించి సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో.. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.

Also Read : ప్రగతి భవన్ పేరు మారుస్తాం.. ఘన విజయం అనంతరం రేవంత్ తొలి కామెంట్

మెజారిటీ బోటాబోటిగా ఉండటంతో ప్రభుత్వంలోకి వెళ్లాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇందులో భాగంగా రేపు ప్రభుత్వ బాధ్యతలను చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేస్తామంటూ గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కానీ, రేపే ప్రభుత్వ బాధ్యతలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అటు ఎల్బీ స్టేడియంలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించాలని డీజీపీకి ఆదేశాలు అందాయి. ఇవాళ రాత్రి హోటల్ తాజ్ కృష్ణ లో సీఎల్పీ సమావేశం జరగనుందని సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలతో నేతలు భేటీ కానున్నారు.

Also Read : బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు.. మళ్లీ అవే ఫలితాలు ..!

కాగా, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. సీఎం పదవి రేసులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.