హోమ్ క్వారంటైన్‌కు హరీష్ రావు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

  • Published By: vamsi ,Published On : June 13, 2020 / 06:44 AM IST
హోమ్ క్వారంటైన్‌కు హరీష్ రావు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

Updated On : June 13, 2020 / 6:44 AM IST

తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి పెరిగిపోగా.. సామాన్యుల నుంచి ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నాయ‌కులు వరకు ఎవ్వరినీ వదిలి పెట్టట్లేదు. జీహెచ్‌ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వ్య‌క్తికి వైర‌స్ సోకగా.. ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఆర్థికమంత్రి హరీష్ రావు పీఏకి కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. 

దీంతో మంత్రితో సహా.. వారి కుటుంబ స‌భ్యులు, ఇత‌ర అధికారుల‌ు హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను క‌రోనా వైర‌స్ విషయమై చైతన్య వంతుల్ని చేస్తున్నారు. అయితే శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో మంత్రికి, 17 మందికి నెగెటివ్‌ వచ్చినట్లుగా తేలింది. 

అయితే, ముందు జాగ్రత్త చర్యగా మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది.

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా.. వారి వెంట వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు.