తెలంగాణ నీటి పారుదల శాఖ‎లో భారీ ప్రక్షాళన.. ఈఎన్‌సీ మురళీధర్ రావుపై వేటు

కాళేశ్వరం ప్రాజెక్ట్ 90వేల కోట్లతో నిర్మించినా ప్రయోజనం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.

తెలంగాణ నీటి పారుదల శాఖ‎లో భారీ ప్రక్షాళన.. ఈఎన్‌సీ మురళీధర్ రావుపై వేటు

Telangana Government On Irrigation Department

Updated On : February 7, 2024 / 10:32 PM IST

Telangana Government : తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈఎన్‌సీ మురళీధర్ రావు రాజీనామా చేయాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇక, కాళేశ్వరం ఇంచార్జ్, రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వక రావును సర్వీస్ నుంచి తొలగించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంపై ప్రభుత్వం సీరియస్ కావడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించిడం తెలిసిందే. విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందడంతో అధికారులపై చర్యలకు ఉపక్రమించింది సర్కార్. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపటి(ఫిబ్రవరి 8) నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది.

Also Read : లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న ఆశావహులు వీరే..

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్ట్ 90వేల కోట్లతో నిర్మించినా ప్రయోజనం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. కృష్ణా పరిధిలో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగింత విషయంలో ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా ఈ.ఎన్.సీ మురళీధర్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈఎన్ సీ స్టేట్ మెంట్ తో ప్రభుత్వం ఇరుకునపడినట్లు అయ్యింది. అసెంబ్లీలో ఇరిగేషన్ పై చర్చ నేపథ్యంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం.

Also Read : బీజేపీకి మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ రాజీనామా.. కారణం ఏమిటంటే?