BC Reservations : బీసీ రిజర్వేషన్ల అంశం.. హైకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 42శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా బిగ్ ప్లాన్..
BC Reservations స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం..

Telangana Govt
BC Reservations : తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. అయితే, బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. హైకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు తీర్పును స్టడీ చేసిన తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్ బిల్‌పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలను పేర్కొంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం స్టే విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి. రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. అయితే, హైకోర్టు తీర్పును స్టడీ చేసిన ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.