Telangana School Holidays : తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు?

తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తారా? పాఠశాలల పున:ప్రారంభం మరింత ఆలస్యం కానుందా?

Telangana School Holidays : తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు?

Telangana School Holidays

Updated On : June 11, 2022 / 5:33 PM IST

Telangana School Holidays : తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తారా? పాఠశాలల పున:ప్రారంభం మరింత ఆలస్యం కానుందా? ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సందేహాలు కలగకమానవు. తెలంగాణలో జూన్ 13 నుంచి బడులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మరో వారం(జూన్ 20) పాటు మూతబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Schools Reopen : తెలంగాణలో 13 నుంచే స్కూల్స్ రీఓపెన్‌

ఎండల తీవ్రత ఎక్కువగా కావడంతో స్కూళ్లు తెరవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందు చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ నెల 13 నుంచి స్కూళ్లు పున:ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యాశాఖ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మరో వారం రోజులు స్కూళ్లకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. అంటే జూన్ 20వ తేదీ నుంచి స్కూళ్లు పున:ప్రారంభం అయ్యే చాన్సుంది. దీనికి ముఖ్య కారణం ఎండల తీవ్రత అధికంగా ఉండటమే.

ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు విపరీతంగా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు 50, 60గా ఉన్న రోజువారీ కేసులు.. ఇప్పుడు 150పైకి చేరాయి. ఈ క్రమంలో విద్యార్థుల సంక్షేమ దృష్ట్యా స్కూళ్లకు సెలవులు పొడిగిస్తేనే మంచిదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.