IAS Officers: ఏపీకి వెళ్లాల్సిందే.. కేంద్రం ఉత్తర్వులు ప్రకారం ఐఏఎస్‌లను రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈనెల 9న కేంద్రం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం..

CAT
Telangana IAS Officers: ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి కరణ, ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ లను కేంద్ర ఉత్తర్వులు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే ఐఏఎస్ లను రివీవ్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్ లతోపాటు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణకు ఆ ఐఏఎస్ లతో సంబంధం లేదని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు.. మంగళవారం క్యాట్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఏపీకి వెళ్లాల్సిందేనని క్యాట్ తేల్చి చెప్పింది.
రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈనెల 9న కేంద్రం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ లు అమ్రపాలి, వాకాటి అరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్ లు తదితరులు ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే, తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు అమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, వాకాటి అరుణ, రొనాల్డ్ రాస్, తదితరులు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.
మంగళవారం ఐఏఎస్ ల విజ్ఞప్తిపై క్యాట్ విచారణ చేపట్టింది. చివరికి ఈ ఐఏఎస్ లకు క్యాట్ షాకిచ్చింది. డీవోపీటీ ప్రకారం ఎక్కడి వారు అక్కడే బుధవారం నాటికి రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి క్యాట్ నిరాకరించింది.