Minister KTR : బీజేపీని గద్దె దించే వరకు వదిలిపెట్టం : మంత్రి కేటీఆర్
ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని పీయూష్ గోయల్ అవమానించారని పేర్కొన్నారు.

Ktr
KTR criticized BJP : మోదీ ప్రధాని కాక ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అధికారం లేనప్పుడు గ్యాస్, పెట్రోల్ ధరలపై మాట్లాడారని తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన మహాధర్నాకు మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. రైతులకు పెద్ద పీట వేస్తానని నమ్మబలికారని చెప్పారు. ఇప్పుడు గ్యాస్ ధర రూ.వెయ్యి అయింది.. కట్టెల పొయ్యి దిక్కయిందని ఎద్దేవా చేశారు.
పార్లమెంట్లో తెలంగాణ ధాన్యం, పెరిగిన ధరలపైనే చర్చ జరుగుతుందని.. ఎక్కడా చాయ్‌పే చర్చ జరగడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగాన్ని బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని చెప్పారు. బీజేపీ నేతల మాటలు విని 35వేల ఎకరాల్లో రైతులు యాసంగి వరి వేశారని తెలిపారు. ఉప్పుడు బియ్యం కొనేది లేదని పియూష్ గోయల్ చెబుతారు.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఉప్పుడు బియ్యం కొంటామని చెబుతారని పేర్కొన్నారు.
Minister KTR: బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అంతు చూస్తాం: మంత్రి కేటీఆర్
ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని పీయూష్ గోయల్ అవమానించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీని గద్దె దించే వరకు వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలా.. అన్నదాతల పక్షాన టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.