తెలంగాణ మంత్రి రాసలీలలు.. ఎలాగైనా సెట్ చేయాలంటూ మీడియేటర్‌తో ఛాటింగ్

telangana minister scandal: తెలంగాణ మంత్రి రాసలీలల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. 10టీవీలో ప్రసారమైన మంత్రి లీలల కథనాలు.. పొలిటికల్ సర్కిల్‌లో కాక పుట్టిస్తున్నాయి. రాసలీలల కథనాలతో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఏకంగా ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది.
మంత్రితో సన్నిహితురాలికి ఉన్న సంబంధాలు.. మంత్రిపై మరో యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ల వరకు.. అసలేం జరిగింది..? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందనే కోణంలో ఇంటెలిజెన్స్ ఆరాతీస్తోంది.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి గారి జిల్లాకు వచ్చిన నటిపై ఆయన మనసు పడ్డారు. ఆమెను ఎలాగైనా సెట్ చేయాలంటూ తన సన్నిహితురాలిని పురమాయించారు. ఆమె తనదైన శైలిలో యువతిని ముగ్గులోకి దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నేరుగా మంత్రే యువతి ఉండే హోటల్‌కి ఒంటరిగా వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
హోటల్‌కి వెళ్లిన మంత్రి అక్కడ యువతితో రాయబేరాలు చేశారా.. ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారా అన్నది ఇంటెలిజెన్స్ ఆరాతీస్తోంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తన వ్యక్తిగత ఫోటోలను మంత్రి సన్నిహితురాలు తీయడం, వాటిని మంత్రికి పంపే ప్రయత్నం చేయడం గుర్తించిన సదరు యువతి మొబైల్‌ను లాక్కుంది. ఆ మొబైల్‌తో సహా హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అక్కడినుంచి చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
10టీవీ కథనం, ఇంటెలిజెన్స్ ఎంట్రీతో మంత్రి రూట్ మారింది. పార్టీ పెద్దలకు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.