తెలంగాణ మంత్రి డర్టీ పిక్చర్ – ఇది ట్రైలర్ మాత్రమే

తెలంగాణ మంత్రి డర్టీ పిక్చర్ – ఇది ట్రైలర్ మాత్రమే

Updated On : October 30, 2020 / 5:04 PM IST

Tenagana minister Scandal: తెలంగాణ మంత్రి డర్టీ పిక్చర్‌… 10టీవీ కథనంతో వెలుగులోకి వచ్చింది. మినిస్టర్‌ సెకండ్‌ షేడ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తోంది. మంత్రి కోరికలు తీర్చేందుకు మనసుపడ్డ యువతితో ఆయనకు సన్నిహితురాలు చేసిన బ్రీఫింగ్‌ ప్రయత్నమంతా బట్టబయలైంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం..

టాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాల్లో నటించిన యువతిపై మంత్రిగారి కన్నుపడింది. ఇంకేం.. తను నాకు కావాలని తన సన్నిహితురాలి ఎదుట ఓపెన్ అయ్యాడు. సెట్‌ చేయాలని పురమాయించాడు. వలపు బాణాలు, చిలిపి కోరికలన్నీ చాటింగ్‌లోనే వెల్లడించాడు సదరు మంత్రి. మినిస్టర్ ఆర్డర్ వేయడమే ఆలస్యం… సన్నిహితురాలు సీన్‌లోకి ఎంటర్ అయింది. యువతితో మాటా ముచ్చటతో దగ్గరైంది.



మంత్రిగారి బ్యాక్‌గ్రౌండ్‌ భలే భలే అంటూ బిల్డప్ ఇచ్చింది. మంత్రిగారి బేరం బాగా ఆలోచించుకోవాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. పొలిటికల్ సాన్నిహిత్యం మంచిదంటూ ముగ్గులోకి దింపే ప్రయత్నం చేసింది. యువతి మాత్రం అందుకు నో చేప్పేసింది. అయినా సరే పట్టు వదలకుండా యువతికి గాలెం వేసేందుకు మంత్రిగారి సన్నిహితురాలు ప్రయత్నాలు చేసింది.

లొంగకపోవడంతో దొంగచాటుగా యువతి వ్యక్తిగత ఫోటోలు సీక్రెట్‌గా తన మొబైల్‌లో షూట్ చేసింది. వాటన్నింటిని మంత్రి సెల్‌ ఫోన్‌కి పంపించేందుకు యత్నించింది. సరిగ్గా అదే టైమ్‌లో మంత్రి సన్నిహితురాలిపై యువతికి అనుమానం వచ్చి మొబైల్‌ ఫోన్ లాక్కుంది. అందులో ఫోటోలు చూసి ఆమె షాక్ అయి అక్కడి నుంచి దూరంగా హైదరాబాద్‌కు వెళ్లిపోయింది.

మంత్రి గారు ఒకటనుకుంటే.. జరిగింది ఇంకొకటి. దీంతో రాజీ ప్రయత్నాలు షురూ చేశారాయన. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మ్యాటర్ చేయి దాటిపోయింది.. సీన్‌ టు సీన్‌ బయటకు వచ్చాక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి సన్నిహితురాలి ఫోన్‌లోని చాటింగ్‌ను స్క్రీన్ షాట్లతో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది యువతి. అంతేకాదు మరికొంతమంది లీడర్లకు కూడా వాటిని పంపిందట. ఇప్పుడా రాసలీలల యవ్వారం రచ్చరచ్చ చేస్తోంది.

మంత్రి గారి కోరికలు చాలా ఉన్నాయి. మసాజ్ కావాలంటూ తన సన్నిహితురాలికి పెట్టిన మెసేజ్‌ ఇప్పుడు 10టీవీ దృష్టికి వచ్చింది. ఇలాంటి మెసేజ్‌లలో కొన్నింటిని మాత్రమే స్క్రీన్‌పై ప్రసారం చేసింది 10tv. సన్నిహితురాలితో ఎలాంటి చాటింగ్ చేస్తున్నారో.. కొన్ని పోస్ట్‌‌లు చూస్తే అర్థమవుతుంది. అసభ్యంగా ఉన్న మెసేజ్‌లు అందినా గౌరవంతో పూర్తి సంయమనంతో ఛానెల్ వాటిని ప్రసారం చేయలేదు.