Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు.

Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Telangana Corona Cases

Updated On : February 20, 2022 / 8:23 PM IST

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 107 కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 12, ఖమ్మం జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,678 మంది కరోనా బారినపడగా వారిలో 7,77,434 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 135 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,109. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,341 కరోనా పరీక్షలు చేశారు. క్రితం రోజుతో(401 కేసులు) పోలిస్తే కరోనా కొత్త కేసులు తగ్గాయి.

Corona Test

Corona Test

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా రోజువారీ కేసులు 20 వేల దిగువకు చేరడం ఊరటనిచ్చే అంశం. మరోవైపు రికవరీలు గణనీయంగా పెరుగుతుండటంతో.. యాక్టివ్ కేసులు తగ్గిపోతున్నాయి.

Corona Tests (1)

Corona Tests (1)

దేశంలో గడిచిన 24 గంటల్లో 11,87,766 కరోనా పరీక్షలు చేయగా.. 19,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2,300 కేసులు తగ్గాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.68%కి పడిపోయింది. నిన్న మరో 673 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,11,903కు చేరింది.

Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు

కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న 48వేల 847 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.20 కోట్లు దాటింది. ఆ రేటు 98.28%కు పెరిగింది. ఇక యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఆ రేటు 0.52%కి పడిపోయి.. ఆ సంఖ్య 2,24,187కు తగ్గింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశంలో నిన్న 30,81,336 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 175 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా లెక్కలు వెల్లడించింది.